Breaking News
  • మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో కామేష్ అలియాస్ హరి ప్రధాన నిందితుడు. జికె వీధి మం పెదపాడులో లంబయ్యను తుపాకీతో కాల్చి చంపిన హరి.
  • ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ అత్యాచారఘటనపై ముగ్గురు సభ్యుల సిట్ దర్యాప్తు బృందం ఏర్పాటు. 7 రోజుల లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.
  • తిరుపతి: తిరుపతిలోని టీటీడీ కి చెందిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం లోని బంగారు నగలు తాకట్టు కేసులో ప్రధాన అర్చకునికి 6 నెలలు జైలు. 2009లో స్వామివారి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు. ఈ మేరకు 2009 ఆగస్టు 21న టిటిడి విజిలెన్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి వెస్ట్ పోలీసులు. ఆలయ ప్రధాన అర్చకుడు తో పాటు కుదువ వ్యాపారులు సాగరమల్లు, రాఘవరెడ్డి లపై ఐపీసీ 409, 420, 411 కింద కేసు నమోదు. 2015లో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు తో పాటు మరో ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష 5 వేలు జరిమానా విధించిన మూడో అదనపు మున్సిఫ్ కోర్టు. తీర్పుపై అప్పీలు కు వెళ్ళిన ఆలయ ప్రధాన అర్చకుడు. ఈ మేరకు మూడు అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో తీర్పు. కేసులో నిందితుడు గా ఉన్న వెంకట రమణ దీక్షితులుకు 6 నెలల జైలు తో పాటు 5 వేల రూపాయలు జరిమానా విదించి మిగతా ఇద్దరిపై కేసు కొట్టివేస్తూ తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి వై వీర్రాజు తీర్పు.
  • విశాఖ: మావోయిస్టులకు ఎదురుదెబ్బ... ఏసీఎం అరెస్ట్ .గాలికొండ ఏరియా కమిటీ మెంబర్ గెమ్మెలి కామేష్ అలియాస్ హరి అరెస్ట్ . గాలికొండ ఏరియాలో కీలకంగా ఉన్న హరి .హరిపై పలు ఎదురుకాల్పులు, హత్యలతోపాటు 50కి పైగా కేసులు .హరి తలపై 4 లక్షల రివార్డు.
  • చెన్నై : చెన్నై మహానగరం లో కిలోల్లో దొరికిన డ్రగ్స్ . చెన్నై రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న వాల్ టాక్స్ రోడ్ లో 25 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న డిఆర్ఐ అధికారులు తమిళనాడు , కేరళ , రాష్ట్రం లోఉన్న డ్రగ్స్ గ్యాంగ్ యూరోపియన్ దేశాలనుండి అక్రమంగా డ్రగ్స్ దిగుమతిని గుర్తించిన అధికారులు . అధికారులకు ఉన్న సమాచారం తో తనిఖీలు నిర్వహించగా 25 కిలోల ( పేశాడో ) డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు. చెన్నై నుండి ఎర్నాకులం కి పార్సెల్ ద్వారా సరఫరా చేస్తునట్టు గుర్తింపు. డ్రగ్స్ ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన డిఆర్ఐ అధికారులు.
  • అక్టోబర్ 4న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదన్న యూపీఎస్సీ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించిన యూపీఎస్సీ. ఈ ఏడాది వాయిదా వేస్తే వచ్చే ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై ఆ ప్రభావం పడుతుందన్న యూపీఎస్సీ. పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఆపైబడిన వారేనని అఫిడవిట్ లో పేర్కొన్న యూపీఎస్సీ. వారంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నామన్న యూపీఎస్సీ. కోవిడ్ సహా అన్ని ప్రోటోకాల్స్ పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన యూపీఎస్సీ. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.50.30 కోట్ల వ్యయం అయినట్లు తెలిపిన యూపీఎస్సీ. నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ ను విచారించనున్న సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 20 మంది యూపీఎస్సీ ఆశావహులు.

ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా కంపెనీ గుడ్‌ బై

ల్యాప్‌టాప్‌ల మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన తొషిబా కంపెనీ ఇప్పుడు ఆ వ్యాపారాల నుంచి పూర్తిగా త‌ప్పుకుంది. జ‌పాన్‌కు చెందిన టెక్ దిగ్గ‌జం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి పూర్తిగా వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ కంపెనీ త‌న‌ డైనాబుక్ ల్యాప్‌టాప్ బ్రాండ్‌లో...

Toshiba Company is officially out of the laptop business, ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా కంపెనీ గుడ్‌ బై

ల్యాప్‌టాప్‌ల మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన తొషిబా కంపెనీ ఇప్పుడు ఆ వ్యాపారాల నుంచి పూర్తిగా త‌ప్పుకుంది. జ‌పాన్‌కు చెందిన టెక్ దిగ్గ‌జం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి పూర్తిగా వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ కంపెనీ త‌న‌ డైనాబుక్ ల్యాప్‌టాప్ బ్రాండ్‌లో 19.9 శాతం వాటాను షార్ప్ సంస్థ‌కు విక్ర‌యించింది. దీనితో ఈ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొల‌గిన‌ట్టైంది. గ‌తంలోనే తొషిబా కంపెనీ 80.1 శాతం వాటాను షార్ప్‌కు విక్ర‌యించిన విష‌యం తెలిసిందే.

ఈ మేర‌కు ”డైనాబుక్‌లోని మిగిలిన 19.9 వాతం వాటాను కూడా షార్ప్ కార్పొరేష‌న్‌కు బ‌ద‌లాయించాము. దీనితో అధికారికంగా డైనాబుక్ ఇప్పుడు షార్ప్‌కు అనుబంధ సంస్థ‌గా మారిందంటూ” తొషిబా ప్ర‌క‌ట‌న చేసింది.

కాగా 1990 నుంచి 2000 వ‌ర‌కూ తొషిబా ల్యాప్‌టాప్‌ల త‌యారీలో టాప్ కంపెనీల్లో ఉండేది. ఆ కంపెనీ త‌యారు చేసిన శాటిలైట్ ల్యాప్‌టాప్‌లు భారీ విజ‌యం సాధించాయి. కానీ త‌ర్వాత లెనోవా, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీలు రంగ ప్ర‌వేశం చేసి మార్కెట్‌పై భారీగా ప‌ట్టు సాధించాయి. ఈ క్ర‌మంలో ఇత‌ర మార్కెట్ల నుంచి తొషిబా తీవ్ర పోటీని ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది.

Read More: 

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌

Related Tags