ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

తాజాగా ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా 24 గంట‌ల్లో 707 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదయిన కేసుల సంఖ్య 1,46,134కు పెరిగింది. అలాగే ఈ వైర‌స్‌ కార‌ణంగా 24 గంట‌ల్లో 20 మంది మృతి చెంద‌గా..

ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కోవిడ్ కేసులు 22 ల‌క్ష‌లు దాటి ప్ర‌పంచ వ్యాప్తంగా 3వ స్థానానికి చేరుకున్నాయి. అందులోనూ భార‌త‌ రాజ‌ధాని ఢిల్లీలో మొద‌ట్లో క‌రోనా కేసులు తీవ్రంగా న‌మోద‌య్యేవి. కానీ ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌తో ఈ మ‌ధ్య కోవిడ్ పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా 24 గంట‌ల్లో 707 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదయిన కేసుల సంఖ్య 1,46,134కు పెరిగింది. అలాగే ఈ వైర‌స్‌ కార‌ణంగా 24 గంట‌ల్లో 20 మంది మృతి చెంద‌గా, మొత్తం మృతుల కేసుల సంఖ్య 4,131గా న‌మోద‌య్యింది. ఇక ఆదివారం క‌రోనా మ‌హ‌మ్మారిని నుంచి కోలుకుని 1070 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య‌ 1,31,657 కాగా, ప్ర‌స్తుతం 10,346 యాక్టీవ్ కేసులు ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఢిల్లీలో టెస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలుః

. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన “కరోనా” RTPCR టెస్ట్‌ల సంఖ్య 3311
. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌ల సంఖ్య 9,012
. దేశ రాజధానిలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 12,04,405
. ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహిస్తున్న కరోనా వైరస్ టెస్ట్‌ల సంఖ్య 63,389
. దేశ రాజధానిలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కేసుల సంఖ్య 5,637
. ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 477
. ఢిల్లీలో ప్రభుత్వ / ప్రైవేట్ హాస్పటల్స్‌లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 13,527

Read More: 

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu