ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు 'వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్'

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అప్‌డేట్స్ కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు. పాలిటిక్స్‌ వ‌ల్ల కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వ‌రుస‌గా రెండు క‌థ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అందులో వేణు శ్రీరామ్ ద‌ర్మ‌క‌త్వంలో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 4:45 PM

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అప్‌డేట్స్ కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు. పాలిటిక్స్‌ వ‌ల్ల కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వ‌రుస‌గా రెండు క‌థ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అందులో వేణు శ్రీరామ్ ద‌ర్మ‌క‌త్వంలో బాలీవ‌డ్ మూవీ ‘పింక్’ రీమేక్ ”వ‌కీల్ సాబ్” ఒక‌టి. దాదాపు ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్త‌యింది.

ఇక మ‌రొకటి డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన స‌మ‌యంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించింది. దీంతో చిత్రీక‌ర‌ణ‌ల‌న్నీ నిలిచిపోయాయి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది. కానీ కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌కు నిరాశ ఎదుర‌వుతుంది. ఫ‌లితంగా సినిమా విడుద‌లేమో కానీ.. ప‌వ‌న్ చిత్రాల నుంచి చిన్న అప్ డేట్ వ‌చ్చినా చాల‌ని ఎదురు చూస్తున్నార‌ని ఫ్యాన్స్‌.

ఇక సెప్టెంబ‌ర్ 2న ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు’ సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ చిత్రం నుంచి ఓ స‌ర్‌ప్రైజ్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు.. ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అందుకు సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. కాగా ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘పోస్ట‌ర్స్, మ‌గువా.. మ‌గువా’ సాంగ్ కూడా ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

Read More: 

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu