ప్రైవేట్ ఆసుపత్రులపై జీహెచ్ఎంసీ డేగకన్ను.. నోటీసుల జారీ.!

ప్రైవేట్ ఆసుపత్రులపై జీహెచ్ఎంసీ డేగకన్ను.. నోటీసుల జారీ.!

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై జీహెచ్ఎంసీ అధికారులు డేగకన్ను వేశారు. గ్రేటర్ పరిధిలో ఉన్న సుమారు 1721 ఆసుపత్రులకు హెల్త్ డిపార్ట్‌మెంట్ లైసెన్సులు జారీ చేయగా..

Ravi Kiran

|

Aug 10, 2020 | 6:40 PM

GHMC Disaster Management: హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై జీహెచ్ఎంసీ అధికారులు డేగకన్ను వేశారు. గ్రేటర్ పరిధిలో ఉన్న సుమారు 1721 ఆసుపత్రులకు హెల్త్ డిపార్ట్‌మెంట్ లైసెన్సులు జారీ చేయగా.. వాటిల్లో 90 శాతం అంటే దాదాపు 1600 హాస్పిటల్స్ ఫైర్ నిబంధనను పాటించడం లేదని గుర్తించారు. దీనితో ఆయా ఆసుపత్రులపై జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ క్షేత్రస్థాయిలో సమగ్ర రిపోర్టును తయారు చేసింది.

ఈ నిబంధనలను పాటించని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే బయటపడే ఎగ్జిట్ మార్గాలు లేవని స్పష్టమైంది. అలాగే కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఇంకా పూర్తిస్థాయిలో ఫైర్ ఎక్యూప్‌మెంట్‌ సిద్ధం కాలేదని అధికారులు గుర్తించారు. మరికొన్ని ఆసుపత్రులు అయిత సెల్లార్లే ల్యాబ్స్‌గా, మెడికల్ షాపులుగాఉపయోగిస్తున్నట్లు తేలింది. అటు ఎక్కువ శాతం నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్నాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇక ఆయా ప్రైవేట్ ఆసుపత్రులకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ నోటీసులు జారీ చేయగా.. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై పలు ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu