Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. విపరీతమైన చలితో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి..

తెలుగు రాష్ట్రాల్లో చలి వణుకుపుట్టిస్తోంది.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగైదు రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు.. 3 నుండి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి.. దీని కారణంగా.. రాగల మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరగనుంది.. శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు నుండి మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఉష్ణోగ్రతలు పెరుతున్నాయి.. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే.. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. మినుములూరు 5, అరకు 6, పాడేరు 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
