AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లోకి కూడా వైరస్ విస్తరిస్తుండటం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా ప్రదేశాల్లో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు దాకా […]

ఏపీలో ఆ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం..!
Ravi Kiran
|

Updated on: Jul 08, 2020 | 6:58 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలతో పాటు మండలాలు, గ్రామాల్లోకి కూడా వైరస్ విస్తరిస్తుండటం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దీనితో ఇప్పటికే ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా ప్రదేశాల్లో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో లాక్‌డౌన్‌ అమలు చేశారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మద్యం షాపులు, కూరగాయాల షాపులు తెరవాలని సూచించారు. ఆ తర్వాత కేవలం మెడికల్ షాపులు, అత్యవసరమైన వాటికి మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఈ నిబంధనలు అమలాపురం, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నారు. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఏడు మండలాల్లో కఠినంగా లాక్ డౌన్ విధించనున్నారు. అత్యవసరం తప్పితే గానీ.. ప్రజలు బయటికి రాకుడదని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?