మరోసారి వాయిదా పడ్డ గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు(మెయిన్స్‌) మరోసారి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2 నుంచి 13వరకు మెయిన్స్‌ జరగాల్సి ఉంది.

మరోసారి వాయిదా పడ్డ గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు
Follow us

|

Updated on: Oct 23, 2020 | 6:55 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు(మెయిన్స్‌) మరోసారి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2 నుంచి 13వరకు మెయిన్స్‌ జరగాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం తెలిపారు. మెయిన్స్‌ నిర్వహణకు సవరించిన తేదీలను 29న ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే మెయిన్స్‌ రాసేందుకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో మార్పు ఉండబోదని, వారంతా పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలకు జవాబులను పునఃపరిశీలించి, ఆ మేరకు తుది జాబితాను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరికొంతమందికి మెయిన్స్‌ రాసే అర్హత లభించే అవకాశం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ ఐదు ప్రశ్నల జవాబులను నిపుణుల కమిటీకి పంపించి, పునఃపరిశీలన తర్వాత.. అదనంగా ఎంతమందికి అర్హత సాధిస్తారన్న దానిపై స్పష్టత రావల్సి ఉంది.