AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారుల విస్తృత తనిఖీల రిపోర్ట్ ఆధారంగా పన్నీర్ అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్ విధించింది. తనిఖీల అనంతరం ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధించింది.

పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
Artificial Paneer Ban
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2026 | 7:37 AM

Share

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కృత్రిమ పన్నీరు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. నిషేధానికి సంబంధించి ఆహార భద్రతశాఖ కమిషనర్‌ పేరుతో ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారుల విస్తృత తనిఖీల రిపోర్ట్ ఆధారంగా పన్నీర్ అమ్మకాలపై ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల చాలా మంది పాల నుంచి తయారు చేసే సంప్రదాయ పన్నీరుకు బదులుగా శాఖాహార కొవ్వులు, పామాయిల్‌, పాలపొడి లాంటి పదార్థాలను ఉపయోగించి కృత్రిమ పన్నీరు తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన పన్నీరు తక్కువ ధరకు లభిస్తుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లలో వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ చీజ్‌ను కూడా పన్నీరు పేరుతో ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.

అసలు పన్నీరు, కృత్రిమ పన్నీరు మధ్య తేడాను గుర్తించడం కూడా కష్టంగా మారిందంటున్నారు అధికారులు. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరీ ముఖ్యంగా తక్కువ ధరకు లభించే పన్నీరు ఉత్పత్తుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక, దేశవ్యాప్తంగా కృత్రిమ పన్నీరు విక్రయాలను నిషేధించే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని FSSIA సూచించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!
స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!
బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు
బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు
దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ S25 FE ఫోన్‌లపై భారీ తగ్గింపులు
దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ S25 FE ఫోన్‌లపై భారీ తగ్గింపులు
తుఫాన్ ప్రభావిత జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన!
తుఫాన్ ప్రభావిత జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన!