‘బీసీల సంక్రాంతి’ పేరిట విజయవాడలో వేడుకలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం లైవ్ అప్డేట్స్..

బీసీల సంక్రాంతి పేరిట విజయవాడలో ఏపీ సర్కారు వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు,..

 • Updated On - 2:51 pm, Thu, 17 December 20 Edited By: Ravi Kiran
'బీసీల సంక్రాంతి' పేరిట విజయవాడలో వేడుకలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం లైవ్ అప్డేట్స్..

బీసీల సంక్రాంతి పేరిట విజయవాడలో ఏపీ సర్కారు వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్దయెత్తున నిర్వహిస్తోన్న ఈ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. లైవ్ అప్డేట్స్ ఈ దిగువున..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 17 Dec 2020 13:40 PM (IST)

  దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో సొంతంగా బాగుపడేందుకు అమరావతి తెచ్చాడు : సీఎం జగన్

  ఇంతపెద్దఎత్తున ఇక్కడ ఇంత సంబరాలు జరుగుతుంటే, దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ విమర్శించారు. అందుకే జనభేరి అంటూ హడావుడి చేస్తున్నారన్నారని పరోక్ష విమర్శలు గుప్పించారు. తాను సొంతంగా బాగుపడేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం రాజధాని అమరావతిని తెచ్చాడని గత ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించారు. రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ విమర్శించారు.

 • 17 Dec 2020 13:34 PM (IST)

  గ్రామ వాలంటీర్లకు సెల్యూట్ చేస్తున్నా : సీఎం జగన్

  గ్రామ వాలంటీర్లకు సెల్యూట్ చేస్తున్నానని, ఎక్కడా స్వార్థం, కుల, మత, రాజకీయాలు చూడకుండా వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని జగన్ చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తున్నారని ప్రశంసించారు.

 • 17 Dec 2020 13:31 PM (IST)

  మంత్రి వర్గంలో 60 శాతం పదవులు బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకే కేటాయించాం, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు : సీఎం జగన్

  తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని సీఎం జగన్ అన్నారు. తన మంత్రి వర్గంలో 60 శాతం పదవులను బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకే కేటాయించామని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీలకే కేటాయించాలని చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించామని తెలిపారు.

 • 17 Dec 2020 13:28 PM (IST)

  రాజకీయాలకు, పార్టీలకు, లంచాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ల ద్వారా మేలు జరగాలి : సీఎం జగన్

  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లలో జరిగిన అకృత్యాలు నేను కళ్లారా చూశాను.. అందుకే కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా మార్పులు రావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నానని జగన్ అన్నారు. రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేకుండా, లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ల ద్వారా మేలు జరగాలన్నదే తన ఉద్దేశ్యమని సీఎం చెప్పారు. అందుకే సంపూర్ణంగా మార్పులు తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

 • 17 Dec 2020 13:24 PM (IST)

  టీడీపీ జెండాను తాము మోశామని సర్టిఫికెట్ చూపిస్తే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగేది కాదు: సీఎం జగన్

  రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో చూశాం.. ఆయా గ్రామాల్లో వెయ్యి మంది పై చిలుకు జనాభా ఉంటే కనీసం ఇద్దరు, ముగ్గురికి కూడా కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వ హయాంలో మేలు జరగలేదని జగన్ చెప్పారు. అదికూడా అధికాక పార్టీకి చెందిన వారికి, జన్మభూమి కమిటీ సభ్యులకు, టీడీపీ జెండాను తాము మోశామని సర్టిఫికెట్ చూపిస్తే తప్ప కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగేది కాదని అని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల వ్యవస్థను అంతగా దిగజార్చారని జగన్ విమర్శించారు.

 • 17 Dec 2020 13:20 PM (IST)

  మహిళా అభ్యుదయంలో రాష్ట్రంలో మరోచరిత్రకు శ్రీకారం చుట్టాం : సీఎం జగన్

  ప్రతీ జిల్లా నుంచీ ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు ఒకొక్క కార్పొరేషన్ కు ఉండేలా నియామకం చేశామని, 29 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 336 మంది డైరెక్టర్లు మహిళలే అని గర్వంగా చెపుతున్నానని సీఎం అన్నారు. మహిళా అభ్యుదయంలో రాష్ట్రంలో మరోచరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ఆలయాల్లో, మార్కెట్ యార్డుల్లో, నామినేషన్ పదవుల్లో ఈ స్ధాయిలో వెనుకబడిన వర్గాలకు పదవులు దక్కడం ఎక్కడైనా చూసారా అని ఆయన ప్రశ్నించారు. అందులో సగం మహిళలకేనని సీఎం తెలిపారు.

 • 17 Dec 2020 13:11 PM (IST)

  బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు : సీఎం జగన్

  బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశామని, ఎన్నికల హామీల్లో ఇచ్చిన నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను తాను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తానని.. అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, మెనార్టీ వర్గాలకు చెందినవారేనని ఆయన పేర్కొన్నారు. కేబినెట్‌ కూర్పులో ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

 • 17 Dec 2020 13:09 PM (IST)

  మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం.. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉంది : సీఎం జగన్

  ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా, బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కాచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందని జగన్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు.

 • 17 Dec 2020 13:05 PM (IST)

  నామినేటెడ్ పదవుల్లో 50శాతం బీసీలకే ఇచ్చాం : సీఎం జగన్

  విజయవాడలో బీసీల సంక్రాంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ చైర్మన్లు… డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్దయెత్తున సభను నిర్వహిస్తున్నారు.

 • 17 Dec 2020 13:04 PM (IST)

  నామినేటెడ్ పదవుల్లో 50శాతం బీసీలకే ఇచ్చాం : సీఎం జగన్

  విజయవాడలో బీసీల సంక్రాంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బీసీల అభివృద్ధి కోసం

  విజయవాడలో బీసీల సంక్రాంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ చైర్మన్లు… డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్దయెత్తున సభను నిర్వహిస్తున్నారు.

 • 17 Dec 2020 13:04 PM (IST)

  కార్పొరేషన్ల వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి .. జగన్