16ఏళ్ళ కిందటి ఘోరం, ఆ మహిళకు మరణ శిక్షపై అమెరికా సన్నాహాలు

అమెరికాలోని షికాగోలో 2004 లో జరిగిన ఓ దారుణం ఇప్పటికీ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ ఏడాదిలో లీసా మోంట్ గే మెరీ అనే మహిళ ఓ గర్భిణిని గొంతు నులిమి చంపి ఆమె గర్భాశయం నుంచి ఇంకా పుట్టని శిశువును 'దొంగిలించింది'.

  • Umakanth Rao
  • Publish Date - 2:05 pm, Thu, 17 December 20
16ఏళ్ళ కిందటి ఘోరం, ఆ మహిళకు మరణ శిక్షపై అమెరికా సన్నాహాలు

అమెరికాలోని షికాగోలో 2004 లో జరిగిన ఓ దారుణం ఇప్పటికీ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ ఏడాదిలో లీసా మోంట్ గే మెరీ అనే మహిళ ఓ గర్భిణిని గొంతు నులిమి చంపి ఆమె గర్భాశయం నుంచి ఇంకా పుట్టని శిశువును ‘దొంగిలించింది’. ఈ దారుణ నేరం జరిగి 16 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు ఈ మహిళకు  మరణశిక్ష విధించడానికి అమెరికా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికీ ఈ కేసును నిపుణులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఈ ఘోరానికి ఈమె ఎలా పాల్పడింది, భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని వారు స్టడీ చేస్తున్నారు. ఇంత హరిఫిక్ నేరం చేయాలంటే ఎంతో ప్లానింగ్ ఉండాలని బోస్టన్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ యాన్ బర్జెస్ అన్నారు. గర్భవతుల గర్భాశయాల నుంచి ఇంకా పుట్టని శిశువుల అపహరణపై ఈయన 1990 ప్రాంతం నుంచి అధ్యయనం చేస్తున్నారు. గత 15, 20 ఏళ్ళ నుంచి ఈ విధమైన నేరాలు పెరుగుతున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ కన్సల్టెంట్ డాక్టర్ జాన్ రెబన్ పేర్కొన్నారు.

2004 లో లీసా అప్పటికి 36 ఏళ్ళ మహిళ. ఆమెకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. డాగ్ బ్రీడర్ అయిన బాబీ అనే గర్భిణిని తన విక్టిమ్ గా లీసా ఎంచుకుందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. బాబీ వద్ద ఓ చిన్న కుక్కపిల్లను కొనుగోలు చేస్తానంటూ ఆమె ఇంటికి వెళ్లిన లీసా..అక్కడ ఆమె గొంతు నులిమి చంపి.. ఆమె కడుపును చురకత్తితో కోసి గర్భాశయం నుంచి ఇంకా ఊపిరి పోసుకుంటున్న శిశువును దొంగిలించింది. రక్తపు మడుగులో పడిఉన్న బాబీని వదిలేసి తన ఇంటికి చేరుకుంది. ఈ దారుణం గురించి ఈమె భర్తకు ఏమీ తెలియదని, ఈ శిశువు తన శిశువేనని తన భర్తకు అబధ్ధం చెప్పిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. 2007 లో కోర్టు ఈమెను దోషిగా పేర్కొని మరణ శిక్ష విధించాలని తీర్పు చెప్పింది.

2021 జనవరి 12 న లీసాకు మరణశిక్ష విధించాలని యూ ఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. ఇండియానా లోని ఫెడరల్ జైల్లో విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి లీసాకు మరణశిక్ష విధించే అవకాశాలున్నాయి.