శరవేగంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు..నేడు స్పిల్ వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.  స్పిల్ వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఇరిగేషన్ అధికారులు.

  • Ram Naramaneni
  • Publish Date - 2:05 pm, Thu, 17 December 20
శరవేగంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు..నేడు స్పిల్ వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.  స్పిల్ వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఇరిగేషన్ అధికారులు. గురువారం పూజా కార్యక్రమం నిర్వహించి గేట్లుకు సంబంధించి ఆర్మ్ గర్డర్స్‌ను అమర్చుతున్నారు. మే చివరి నాటికి గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది అని సిఈబి సుధాకర్ బాబు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2022 ఖరీఫ్ నాటికి నీళ్లు అందిస్తామని సూపరిండెంటెంట్ ఇంజనీర్ ఎం.నాగిరెడ్డి చెప్పారు. తొలుత పూజాకార్యక్రమాలు నిర్వహించి గేట్లకు సంబంధించి ఆర్మ్ గడ్డర్లు లిఫ్ట్ చేశారు.  ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సిఈబి సుధాకర్ బాబు, ఎస్ఈ ఎం నాగిరెడ్డి, ఈఈ ఆదిరెడ్డి, డిఈలతో పాటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ జనరల్ మేనేజర్ సతీష్ బాబు అంగర, మేనేజర్ మురళి, బేకం కంపెనీ డైరెక్టర్ కాళీ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

Also Read :