శేఖర్ మాస్టర్‌కి చుక్కలు చూపించిన ప్రదీప్.. ఏం జరిగిందంటే!
యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. తను ఏ షో చేసినా.. అది ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది. ఇప్పుడు ప్రస్తుతం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో..
యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. తను ఏ షో చేసినా.. అది ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వెండి తెరపై అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే యాంకర్ రవి, సుడిగాలి సుధీర్‌లు హీరోలుగా ట్రై చేసి.. మళ్లీ ఇప్పుడు టీవీ షోలతో బిజీ అయ్యారు. ఇప్పుడు మరి ప్రదీప్ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో చూడాలి.
అయితే ప్రదీప్ డ్యాన్స్‌లో కాస్త వీక్ అనే చెప్పాలి. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ జోడీతో కాస్త డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో తాజాగా ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో డ్యాన్స్‌తో ఇరగదీశాడు ప్రదీప్. ‘మీకో దండం అంటూ’.. తాజాగా ప్రదీప్ సినిమాలో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రదీప్ డ్యాన్స్‌కి అందరూ ఫిదా కావాల్సిందే. మంచి స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సాంగ్‌కి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్.. కొరియోగ్రాఫ్ చేశారు. అయితే డ్యాన్స్ నేర్చుకునే క్రమంలో శేఖర్ మాస్టర్‌కి ప్రదీప్ చుక్కలు చూపించినట్లు పలు కామెంట్స్ వస్తున్నాయి. ఇలా డ్యాన్స్ నేర్చుకునే క్రమంలోనే ప్రదీప్ లెగ్ ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం.
కాగా.. ’30 రోజుల్లో ప్రేమిండచం ఎలా?’ సినిమాలో పాటలన్నీ చంద్రబోస్ రాశారు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ప్రదీప్ ప్రేమ పాఠాలు చెప్పబోతున్నాడట. కాగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రానాతో, పాటలను మహేష్, కాజల్ లాంటి స్టార్స్‌తో విడుదల చేయించాడు ప్రదీప్.
Read More: విశాఖలో సెక్రటేరియట్‌కు స్థలం రెడీ.. సీఎం గ్రీన్ సిగ్నల్!