ఏఎన్-32 విమాన శ‌కలాలు లభ్యం… అంతా మృతులే!

భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ నిన్న లభించిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ 13 మంది ప్రాణాలతో మిగల్లేదని భారత వాయుసేన ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఐఏఎఫ్ తెలిపింది. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని లిపో ప‌ట్ట‌ణానికి 16 కిలోమీట‌ర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. సుమారు 12వేల ఫీట్ల ఎత్తులో ఆ శ‌క‌లాల‌ను గుర్తించారు. వాయుసేన‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్ట‌ర్ […]

ఏఎన్-32 విమాన శ‌కలాలు లభ్యం... అంతా మృతులే!
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 4:23 PM

భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ నిన్న లభించిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ 13 మంది ప్రాణాలతో మిగల్లేదని భారత వాయుసేన ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఐఏఎఫ్ తెలిపింది. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని లిపో ప‌ట్ట‌ణానికి 16 కిలోమీట‌ర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. సుమారు 12వేల ఫీట్ల ఎత్తులో ఆ శ‌క‌లాల‌ను గుర్తించారు. వాయుసేన‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్ట‌ర్ విమాన శ‌క‌లాల‌ను ప‌సిక‌ట్టింది.  13మందితో ప్రయాణిస్తున్న ఏఎన్ – 32 విమానం గ‌త సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాత్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కాసేపటికే అదృశ్యమైంది. నాటి నుంచి విమానం కోసం ఐఏఎఫ్ గాలింపు చేపట్టింది.

ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది మృతదేహాల్ని, ఏఎన్-32 విమానం బ్లాక్ బాక్స్ ను విమాన శకలాల్లోనుండి స్వాధీనం చేసుకున్నారు.