AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah-Sharad Pawar Meet: అమిత్ షా‌తో శరద్ పవార్ రహస్య భేటీ నిజమేనా? బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Shah-Sharad Pawar Meet: మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడి ఇదే హాట్ టాపిక్. గత వారం అహ్మదాబాద్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారా? లేదా?

Amit Shah-Sharad Pawar Meet: అమిత్ షా‌తో శరద్ పవార్ రహస్య భేటీ నిజమేనా? బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Amith-Shah
Janardhan Veluru
|

Updated on: Mar 30, 2021 | 5:40 PM

Share

మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడి ఇదే హాట్ టాపిక్…గత వారం అహ్మదాబాద్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారా? లేదా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారిద్దరి మధ్య రహస్య భేటీ నిజమే అయితే ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనన్న అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఓ మీడియా సమావేశంలో శరద్ పవార్‌తో రహస్య భేటీపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అమిత్ షా…‘అన్ని అంశాలను బయటకు చెప్పలేం’ అన్న నర్మగర్భ వ్యాఖ్యలతో మీడియా ‘ఊహాగానాల’కు లాకులు ఎత్తేశారు. మహారాష్ట్రలో అధికార పక్షాలైన శివసేన, ఎన్సీపీల మధ్య లుకలుకలు మొదలయ్యాయని…ఈ నేపథ్యంలోనే అమిత్ షాను శరద్ పవార్ రహస్యంగా కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయొచ్చన్న చర్చ మొదలయ్యింది. అయితే అమిత్ షా, శరద్ పవార్ మధ్య రహస్య భేటీ జరిగిందన్న కథనాలను శివసేన, ఎన్సీపీ నేతలు తోసిపుచ్చారు. అమిత్ షాతో శరద్ పవార్ రహస్య భేటీ కథనాలను తోసిపుచ్చిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్…బీజేపీ పుకార్లు సృష్టిస్తోందని ఆరోపించారు. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ భేటీ జరగలేదని చెప్పుకొచ్చారు.

తూచ్..అలాంటి రహస్య భేటీ ఏదీ జరగలేదని ఎన్సీపీ, శివసేన నేతలు కుండబద్ధలుకొట్టినట్లు చెబుతున్నా…ఈ అంశంపై మహారాష్ట్రలో రాజకీయ కాక మాత్రం ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమిత్ షా-శరద్ పవార్ రహస్య భేటీ ఊహాగానాలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏదైనా పని’ నిమిత్తం శరద్ పవార్…కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఉండొచ్చంటూ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయినా భారత సంస్కృతిలో ఇలా రాజకీయాలకు అతీతంగా నాయకులు కలుసుకోవడం సహజమేనని…దీన్ని భూతద్ధంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ నిర్ణయాల కోసమే ఇలాంటి భేటీలు జరుగుతాయని భావించాల్సిన అవసరం లేదన్నారు. అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉన్నారని…ఏదైనా పనిగా ఆయన్ను శరద్ పవర్ కలిసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..West Bengal Election 2021: ప్రధాని మోదీది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే…ఎన్నికల సంఘానికి TMC ఫిర్యాదు