కరోనా కట్టడి కోసం.. ‘ఆవు’ యాంటీబాడీలు..

కొవిడ్‌-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సీన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అయితే.. మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ఆవుల్లో ఉత్పత్తయిన

కరోనా కట్టడి కోసం.. 'ఆవు' యాంటీబాడీలు..
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 12:01 PM

Cow antibodies: కొవిడ్‌-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సీన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అయితే.. మహమ్మారిని అరికట్టడానికి ఆవుల్లో ఉత్పత్తయిన యాంటీబాడీలు దోహదపడగలవని అంటున్నారు శాస్త్రవేత్తలు. జన్యు మార్పిడి విధానంలో గోవుల్లో తయారుచేసే ఈ యాంటీబాడీలను మానవుల్లో ప్రవేశపెడితే కరోనా నిర్మూలన సాధ్యమేనని వారు చెబుతున్నారు. సాధారణంగా గోవులను యాంటీబాడీ కర్మాగారాలుగా అభివర్ణిస్తుంటారు. మనుషులతో పోలిస్తే వాటి రక్తంలో ప్రతి మిల్లీలీటరుకు దాదాపు రెట్టింపు స్థాయిలో యాంటీబాడీలు ఉంటాయి.

వివరాల్లోకెళితే.. అమెరికాలోని సౌత్‌ డకోటాకు చెందిన సాబ్‌ బయోథెరపాటిక్స్‌ కంపెనీ శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో కరోనా వైరస్‌పై ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ను గోవుల్లో ప్రవేశపెట్టారు. దీంతో వాటిలో అధిక సంఖ్యలో శక్తిమంతమయిన పాలీక్లోనల్‌ యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి. ఇవి వైరస్‌కు చెందిన అనేక భాగాలను గుర్తించగలవు. వాటికి అతుక్కొని అంతం చేయగలవు. ప్రస్తుతం చాలా కంపెనీలు కరోనాపై పోరాటానికి మోనోక్లోనల్‌ యాంటీబాడీలను తయారుచేస్తున్నాయి.

కాగా.. ఉత్పరివర్తనాలతో కరోనా తన రూపాన్ని కాస్త మార్చుకున్నా ‘మోనోక్లోనల్‌’తో లాభముండదు. ఎందుకంటే.. వైరస్‌కు చెందిన నిర్దిష్ట భాగాన్ని మాత్రమే అవి గుర్తించగలవు. పాలీక్లోనల్‌ యాంటీబాడీలు వాటికంటే చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఒక ఆవు ఒక్క నెలలో ఉత్పత్తి చేసే యాంటీబాడీలతో వందల మంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పారు. రెండు నెలల్లో పాలీక్లోనల్‌ యాంటీబాడీలపై క్లినికల్‌ ప్రయోగాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో