ఇకపై ఇంటికే మందులు.. ఆన్‌లైన్ ఫార్మసీలోకి ఈ కామర్స్ దిగ్గజం.. అమ్మకాలు మొదలుపెట్టిన అమెజాన్
ఇప్పటివరకు ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు ఇతరత్రా సరకులను అందించిన అమెజాన్ మందులను కూడా నేరుగా ఇంటికి అందించేందుకు ఫ్లాన్ చేసింది.
ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు ఇతరత్రా సరకులను అందించిన అమెజాన్ మందులను కూడా నేరుగా ఇంటికి అందించేందుకు ఫ్లాన్ చేసింది. అమెరికాలో మంగళవారం నుంచే మందుల అమ్మకాలను మొదలుపెట్టింది. అమెజాన్ తాజా అడుగుతో ఫార్మసీ రంగంపై గట్టి ప్రభావమే పడనుంది. ముఖ్యంగా అమెరికాలోని సీవీఎస్, వాల్‌గ్రీన్స్ వంటి మెడికల్ స్టోర్స్ పై గట్టి దెబ్బనే పడేటట్లు కనిపిస్తుంది.
మంగళవారం నుంచి ముఖ్యంగా క్రీములు, ఇన్‌సులిన్స్, ఇన్‌హేలర్ల అమ్మకాలను అమెజాన్ మొదలుపెట్టింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ను అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేస్తే, ఇతర మందులు కూడా పంపడానికి రంగం సిద్ధం చేస్తోంది. కొంత కాలం నుంచి అమెజాన్ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి సారిస్తూవస్తోంది. రెండేళ్ల కిందట పిల్‌ప్యాక్ అనే ఆన్‌లైన్ ఫార్మసీని 750 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది అమెజాన్. అప్పటి నుంచి ఫార్మసీని మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇకపై అన్ని రకాల మందులను త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ పేర్కొంది.
Amazon launches online pharmacy in new contest with drug retail https://t.co/Gob7hH01Xk pic.twitter.com/R5TyWQfWPe
— Reuters India (@ReutersIndia) November 17, 2020