బీజేపీది మరీ ఇంత ‘త్యాగమా’ ? నితీష్ కి బీహార్ సీఎం కుర్చీపై శివసేన వండర్ !

బీహార్  ఎన్నికల్లో ఓ పార్టీ మూడో స్థానానికి దిగజారినప్పటికీ సీఎం పదవిని ఆ పార్టీకి ఇచ్చి బీజేపీ తన 'త్యాగనిరతిని' చాటుకుందని శివసేన వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. గత ఏడాది మహారాష్ట్ర..

బీజేపీది మరీ ఇంత 'త్యాగమా' ? నితీష్ కి బీహార్ సీఎం కుర్చీపై శివసేన వండర్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 18, 2020 | 4:08 PM

బీహార్  ఎన్నికల్లో ఓ పార్టీ మూడో స్థానానికి దిగజారినప్పటికీ సీఎం పదవిని ఆ పార్టీకి ఇచ్చి బీజేపీ తన ‘త్యాగనిరతిని’ చాటుకుందని శివసేన వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఇదే త్యాగాన్ని మా పట్ల ఎందుకు చూపలేదని ప్రశ్నించింది. ఫేవర్ అనే ‘బర్డెన్’ కింద నితీష్ కుమార్ ఎంతకాలం పట్టు నిలుపుకుంటారని, ఆయన కొత్త మార్గాన్ని ఎంచుకుంటారని సేన తన ‘సామ్నా’ పత్రిక ఎడిటోరియల్ లో పేర్కొంది. నిరుడు మహారాష్ట్ర ఎన్నికల అనంతరం బీజేపీ 105 సీట్లను, దాని మిత్ర పక్షం శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయాయి. కాగా బీహార్ విషయంలో కమలం పార్టీ మరీ ఇంత ఉదారత చూపడమేమిటని శివసేన వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో త్యాగాల గురించి రాయడానికి పెన్ను లో ‘ఇంకు’ కొరత ఏర్పడుతుందని సేన గమ్మత్తుగా పేర్కొంది.