AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సరిలేరు’ను డామినేట్ చేసిన ‘వైకుంఠపురం’.. ఓవర్సీస్‌లో బన్నీ జోరు!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లో అల్లు అర్జున్ కంటే మహేష్ హవానే ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా తొమ్మిది సార్లు వన్ మిలియన్ డాలర్ క్లబ్ హీరోగా […]

'సరిలేరు'ను డామినేట్ చేసిన 'వైకుంఠపురం'.. ఓవర్సీస్‌లో బన్నీ జోరు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 10:31 PM

Share

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లో అల్లు అర్జున్ కంటే మహేష్ హవానే ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా తొమ్మిది సార్లు వన్ మిలియన్ డాలర్ క్లబ్ హీరోగా కూడా రికార్డు సృష్టించారు. అటు బన్నీకి మాత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తప్పితే చెప్పుకోదగ్గ వసూళ్ల రికార్డు లేదు.

అయితే తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ అమెరికాలో కేవలం 175 లొకేషన్లలో రిలీజయ్యి మొదటి రోజే దాదాపు 800కె డాలర్ల వసూళ్లు సాధించిందట. ‘సరిలేరు’ కంటే తక్కువ టికెట్ ధర(14 డాలర్ల)తోనే బన్నీ ఈ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. అక్కడ సరిలేరు నీకెవ్వరు టికెట్ ధర 22 డాలర్లు. దీనితో మహేష్‌ను స్టైలిష్ స్టార్ పూర్తిగా డామినేట్ చేశారనే చెప్పాలి. ఇప్పటికే అమెరికాలో కెరీర్ బెస్ట్ రికార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తొందర్లోనే వన్ మిలియన్ మార్క్‌ను కూడా రీచ్ కానున్నారు. కాగా, బన్నీ-త్రివిక్రమ్ కాంబోపైన ఓవర్సీస్‌లో విపరీతమైన క్రేజ్ ఉండగా.. ఇదే గనక కంటిన్యూ అయితే తొలి వీకెండ్‌లోనే అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడం ఖచ్చితమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..