AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు..? చిరంజీవే మెచ్చినోడు..

అమ్మ పక్కన బుద్దిగా కనిపిస్తున్న ఈ చిన్నబ్బాయి.. ఇప్పుడు టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఐబీఎం ఉద్యోగాన్ని వదిలి సినిమాల కోసం వచ్చిన ఈ నటుడిని మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసించారు. ఇంతకీ ఈ టాలెంటెడ్ హీరో ఎవరో తెలుసా..?

ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు..? చిరంజీవే మెచ్చినోడు..
Actor Childhood Photo
Ram Naramaneni
|

Updated on: May 11, 2026 | 3:46 PM

Share

అమ్మ ఒడిలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నబ్బాయి.. ఇప్పుడు టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కష్టంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా..?

విశాఖపట్నంలో జన్మించిన ఈ యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంలో ఉద్యోగం చేశాడు. మంచి జీతం, సెటిల్ లైఫ్ ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి ఉన్న నటనపై ఆసక్తి అతడిని సినిమాల వైపు లాగింది. ఆ కలను నిజం చేసుకోవడానికి లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్నే వదిలి హైదరాబాద్ చేరుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు, సహాయ నటుడి క్యారెక్టర్లతో కెరీర్ ప్రారంభించిన అతడు.. తన సహజ నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించాడు.

తర్వాత హీరోగా మారి వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అద్భుతంగా రాణిస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అతడి నటన చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు. “ఈ నటుడు దేశవ్యాప్తంగా గొప్ప స్థాయికి వెళ్తాడు” అంటూ అభినందించారు కూడా.

ఇప్పటికే ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. మరెవరో కాదు.. సత్య దేవ్. హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఫుల్ బాటిల్’, ‘గరుడ ఛాప్టర్ 1’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Satyadev (@actorsatyadev)

Follow Us
ఈ అబ్బాయి ఇప్పుడు యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడు..
ఈ అబ్బాయి ఇప్పుడు యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడు..
డెలివరీ బాయ్‌గా మారిన టాలీవుడ్ క్రేజీ హీరో.. వీడియో ఇదిగో
డెలివరీ బాయ్‌గా మారిన టాలీవుడ్ క్రేజీ హీరో.. వీడియో ఇదిగో
చికెన్ కూర నీచు వాసన రాకుండా మంచి రుచిగా చేయాలంటే ఇలా చేయండి..
చికెన్ కూర నీచు వాసన రాకుండా మంచి రుచిగా చేయాలంటే ఇలా చేయండి..
కోట్లాది మంది ఉన్నా మీ వేలిముద్ర మాత్రం ఎందుకు మారదు?
కోట్లాది మంది ఉన్నా మీ వేలిముద్ర మాత్రం ఎందుకు మారదు?
సోమనాథ్ ఆలయంలో మోడీ.. 11 పుణ్యక్షేత్రాల జలాలతో శివాభిషేకం..
సోమనాథ్ ఆలయంలో మోడీ.. 11 పుణ్యక్షేత్రాల జలాలతో శివాభిషేకం..
మనుషుల కంటే వేగంగా ప్రమాదాన్ని పసిగట్టే 8 జంతువులివే
మనుషుల కంటే వేగంగా ప్రమాదాన్ని పసిగట్టే 8 జంతువులివే
గొడవలకు ఎండ్ కార్డ్ వేసి లక్ష్యాల వైపు పయనించడం ఎలా?
గొడవలకు ఎండ్ కార్డ్ వేసి లక్ష్యాల వైపు పయనించడం ఎలా?
ఐపీఎల్ 2026 నుంచి లక్నో ఔట్.. కట్‌చేస్తే.. ముగ్గురికి వీడ్కోలు?
ఐపీఎల్ 2026 నుంచి లక్నో ఔట్.. కట్‌చేస్తే.. ముగ్గురికి వీడ్కోలు?
సుదీర్ఘ రైలు ప్రయాణంలో మంచి నిద్ర కోసం ఏ బెర్త్ మంచిది?
సుదీర్ఘ రైలు ప్రయాణంలో మంచి నిద్ర కోసం ఏ బెర్త్ మంచిది?
JEE అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌
JEE అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌