AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డెలివరీ బాయ్‌గా మారిన టాలీవుడ్ క్రేజీ హీరో.. హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ.. వీడియో వైరల్

పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ టాలీవుడ్ హీరో ఉన్నట్లుండి హైదరాబాద్ రోడ్లపై ప్రత్యక్షమయ్యాడు. బ్లింక్ ఇట్ గ్రాసరీస్ బ్యాగ్ ను మెడకు వేసుకుని డెలివరీ బాయ్ గా సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tollywood:  డెలివరీ బాయ్‌గా మారిన టాలీవుడ్ క్రేజీ హీరో.. హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ.. వీడియో వైరల్
Tollywood Actor
Basha Shek
|

Updated on: May 11, 2026 | 3:44 PM

Share

ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నటుల్లో శ్రీ నందు ఒకరు. కెరీర్ ప్రారంభంలో 100 పర్సెంట్ లవ్, ఆటోనగర్ సూర్య వంటి సినిమాల్లో సహాయక నటుడి పాత్రలు చేసిన నందు ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించాడు. అయితే కమర్షియల్ గా ఒక సరైన హిట్ అందుకోలేకపోతున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఆ మధ్యన సైక్ సిద్ధార్థ్ అనే ఓ డిఫరెంట్ ఫిల్మ్ చేసినా ఫలితం లేకపోయింది. అయినా నిరాశచెందకుండా విభిన్నమైన సినిమా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలా నందు నటించిన తాజా చిత్రం అగ్లీ స్టోరీ. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికాగోర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. రియా జియా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి లక్కీ మీడియా బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి.

కాగా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న అగ్లీ స్లోరీ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో నందు తెగ కష్టపడుతున్నాడు. తన సినిమాను జనాల్లోకి తీసుకునిపోయేందుకు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా డెలివరీ బాయ్ గా మారిపోయాడు నందు. బ్లింకిట్ గ్రాసరీ బ్యాగ్ ను మెడన వేసుకుని హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. నందు డెలివరీ బాయ్ గా రోడ్లపై వెళ్తున్నప్పుడు కొందరు అభిమానులు తనని గుర్తించారు. అన్నా నువ్వేందిలా అని అడగడంతో నందు అసలు విషయం చెప్పాడు. తన సినిమా విడుదల తేదీకి సంబంధించిన పాంప్లెట్స్ పంచుతూ అగ్లీ స్టోరీ సినిమా మే 22వ తేదీ విడుదలవుతుంది కచ్చితంగా చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు నందును మెచ్చుకుంటున్నారు. అతని సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 బ్లింకిట్ బ్యాగ్ తో హీరో నందు.. వీడియో ఇదిగో..</

h3>

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us