AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకొద్దీ మొగుడు.. ఆ మహిళ చెప్పే రీజన్ చూస్తే షాక్ తినాల్సిందే..!

పెళ్లి అయ్యాక.. నవదంపతుల మధ్య అన్యోన్యత ఉంటే కొనసాగే కాపురం ఓ విధంగా ఉంటే.. ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడితే మరోలా ఉంటుంది.  అదేసమయంలో ఒకరి ఇష్టాలను ఒకరు అర్ధం చేసుకుంటే.. ఆ జంట కాపురం హాయిగా కొనసాగుతుంది. అదే.. భర్తకు నచ్చనట్లు భార్య.. భార్యకు నచ్చని విధంగా భర్త నడుచుకుంటే.. ఇక ఆ కాపురంలో నిత్యం గొడవలే. చివరకు కోర్టు మెట్లెక్కి.. విడాకులకు అప్లై చేసుకోవడమే. ఇది ప్రస్తుత ట్రెండ్‌. తాజాగా బీహార్‌లో కూడా ఇలాంటిదే […]

నాకొద్దీ మొగుడు.. ఆ మహిళ చెప్పే రీజన్ చూస్తే షాక్ తినాల్సిందే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 11:13 AM

Share

పెళ్లి అయ్యాక.. నవదంపతుల మధ్య అన్యోన్యత ఉంటే కొనసాగే కాపురం ఓ విధంగా ఉంటే.. ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడితే మరోలా ఉంటుంది.  అదేసమయంలో ఒకరి ఇష్టాలను ఒకరు అర్ధం చేసుకుంటే.. ఆ జంట కాపురం హాయిగా కొనసాగుతుంది. అదే.. భర్తకు నచ్చనట్లు భార్య.. భార్యకు నచ్చని విధంగా భర్త నడుచుకుంటే.. ఇక ఆ కాపురంలో నిత్యం గొడవలే. చివరకు కోర్టు మెట్లెక్కి.. విడాకులకు అప్లై చేసుకోవడమే. ఇది ప్రస్తుత ట్రెండ్‌.

తాజాగా బీహార్‌లో కూడా ఇలాంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్తతో కాపురం చేయలేనని.. విడాకులు కావాలంటూ అప్లై చేసుకుంది. అయితే మీరనుకుంటున్నట్లు తన భర్త కొడుతున్నాడనో.. లేక కట్నం డిమాండ్ చేస్తున్నాడనో కాదు. ఇక్కడ రీజన్ వింటే.. కాస్త చిత్రంగానే ఉంటుంది. అదేంటంటే.. తన భర్త స్నానం చెయ్యట్లేదనీ, షేవింగ్ కూడా చేసుకోడనీ, పళ్లు కూడా అప్పుడప్పుడూ మాత్రమే తోముకుంటాడని ఆరోపిస్తూ.. విడాకులకు ధాఖలు చేసుకుంది.

తన భర్త దూరంగా ఉంటేనే విపరీతమైన దుర్వాసన వస్తాడని.. ఇక దగ్గరికి వస్తే భరించలేమని ఫిర్యాదులో పేర్కొంది. తనకు వెంటనే విడాకులు ఇప్పిస్తే.. నా బతుకేదో బతుకుతానంటూ.. మొరపెట్టుకుంది. దీంతో బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్.. ఆ మహిళ భర్తను పిలిపించింది. అయితే కమిషన్ ముందు సదరు వ్యక్తి హాజరవ్వడంతోనే… దుర్వాసనను అక్కడి సభ్యులు భరించలేకపోయారు. ఆ కంపును భరించలేక.. విడాకులు ఇవ్వడం కరెక్టేనన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఓ అవకాశం ఇచ్చిచూద్ధామని.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా రెండు నెలల్లో.. నీ భార్య కోరుకున్న విధంగా నడుచుకుంటే.. సరేసరి..లేదంటే విడాకులు ఇచ్చేస్తామని హెచ్చరించారు. కాగా, తొలుత ఇలాంటి చిన్న చిన్న కారణాలకు విడాకులు ఇవ్వరని మహిళా కమిషన్ సభ్యులు ఆమెకు చెప్పారు. అయితే డైరక్ట్‌గా వారే ఆ కంపు బారిన పడటంతో.. విడాకులు ఇవ్వడం సబబే అనుకున్నారు.

Follow Us
రాత్రి కాయలు.. తెల్లారేసరికి పండ్లు..
రాత్రి కాయలు.. తెల్లారేసరికి పండ్లు..
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త