AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌టెల్‌ సంచలన ఆఫర్..రీఛార్జ్‌పై 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్

జియో వచ్చిన తర్వాత మిగిలిన టెలికాం కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలసిందే. ఊహించని ఆఫర్లు, ఎగ్జైట్ చేసే ప్లాన్స్‌తో జియో ప్రస్తుతం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. కాగా జియోకి చెక్ పెట్టేందుకు..కాంపీటషన్‌‌లో ముందుకొచ్చేందుకు..  ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌లో ఉన్న ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు జీవిత బీమా కవరేజ్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకుంది. మెసేజ్ చెయ్యడం ద్వారా, […]

ఎయిర్‌టెల్‌ సంచలన ఆఫర్..రీఛార్జ్‌పై 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2019 | 3:35 AM

Share

జియో వచ్చిన తర్వాత మిగిలిన టెలికాం కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలసిందే. ఊహించని ఆఫర్లు, ఎగ్జైట్ చేసే ప్లాన్స్‌తో జియో ప్రస్తుతం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. కాగా జియోకి చెక్ పెట్టేందుకు..కాంపీటషన్‌‌లో ముందుకొచ్చేందుకు..  ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌లో ఉన్న ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు జీవిత బీమా కవరేజ్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకుంది. మెసేజ్ చెయ్యడం ద్వారా, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ రిటైలర్ వద్దకు వెళ్లి కూడా ఇన్సూరెన్స్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్‌ నూతన ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌ అయిన రూ.599 ప్రకారం.. రోజుకు 2జీబీల డాటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రూ.4 లక్షల జీవిత బీమాను భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కల్పించనున్నది. ఈ ప్లాన్‌ 84 రోజుల పాటు అమలులో ఉండనున్నది. 18 ఏండ్ల నుంచి 54 ఏండ్ల లోపు వయస్సు కలిగిన వారికి మాత్రమే బీమా కవరేజ్‌ కల్పిస్తున్నది సంస్థ. అంతేకాదు ఎలాంటి వైద్య పరీక్షలు,  డెత్ సర్టిఫికేట్లు అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్‌ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. కాగా తమిళనాడు, పాండిచ్చేరి, న్యూఢిల్లీ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించిందని, క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్‌ ప్రారంభించనున్నట్లు కంపెనీ  తెలిపింది.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..