టీ20 ప్రపంచకప్‌ : ఇదిగో క్లియర్ షెడ్యూల్..

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ఇటీవలే ముగియడంతో టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. కంగారూల గడ్డపై 2020 అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. క్వాలిఫయిర్ టోర్నీలో పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి చిన్న […]

టీ20 ప్రపంచకప్‌ : ఇదిగో క్లియర్ షెడ్యూల్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 05, 2019 | 2:13 AM

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ఇటీవలే ముగియడంతో టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. కంగారూల గడ్డపై 2020 అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. క్వాలిఫయిర్ టోర్నీలో పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి చిన్న జట్లు అర్హత సాధించడంతో ఐసీసీ కాస్త డిపరెంట్‌గా షెడ్యూల్‌ను రూపొందించింది. చిన్న జట్లను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విభజించింది. టాప్-10 పది జట్లలో ఉన్న రెండు పెద్ద జట్లను ఈ రెండు గ్రూపుల్లో చేర్చింది.

గ్రూప్‌-ఏలో శ్రీలంకతో పాటు పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌‌తో పాటు గ్రూప్‌-బీలో నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-12లో ఉన్న జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విభజించారు.

సూపర్‌-12…. చిన్నజట్లు ఆడిన… గ్రూప్‌-ఏలో తొలిస్థానంలోని జట్టు, గ్రూప్‌-బిలో రెండో స్థానంలోని జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-1లో చేరతాయి. ఇందులో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ ఉంటాయి.  ఇక గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-2లో చేరతాయి.  ఇందులో భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. సూపర్‌-12 దశలో భారత్‌ ఐదు మ్యాచుల్లో తలపడనుంది. తొలి మ్యాచ్​ను సౌతాఫ్రికాతో ఆడనుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్‌ జట్టుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నవంబర్‌ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ నిర్వహిస్తారు.

గ్రూప్​-ఏ: శ్రీలంక, పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ జట్లు ఒకదానితో మరొకటి తలపడతాయి.

గ్రూప్​-బీ: బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు టాప్​-12 కోసం పోటీపడతాయి.

అక్టోబర్​ 18: శ్రీలంక VS క్వాలిఫయర్​ ఏ3(కార్డీనియా పార్క్​, సౌత్ గీలాంగ్​) అక్టోబర్​ 18:క్వాలిఫయర్​ ఏ2 VS క్వాలిఫయర్​ ఏ4(కార్డీనియా పార్క్​, సౌత్ గీలాంగ్) అక్టోబర్​ 19: బంగ్లాదేశ్​ VS క్వాలిఫయర్​ బీ3 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా) అక్టోబర్​ 19: క్వాలిఫయర్​ బీ2 Vs క్వాలిఫయర్​ బీ4 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా) అక్టోబర్​ 20: క్వాలిఫయర్​ ఏ3 Vs క్వాలిఫయర్​ ఏ4(కార్డీనియా పార్క్​, సౌత్ గీలాంగ్) అక్టోబర్​ 20: శ్రీలంక Vs క్వాలిఫయర్​ ఏ2(కార్డీనియా పార్క్​, సౌత్ గీలాంగ్) అక్టోబర్​ 21: క్వాలిఫయర్​ బీ3 Vs క్వాలిఫయర్​ బీ4 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా) అక్టోబర్​ 21: బంగ్లాదేశ్​ Vs క్వాలిఫయర్​ బీ2 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా) అక్టోబర్​ 22:క్వాలిఫయర్​ ఏ2 Vs క్వాలిఫయర్​ ఏ3 (కార్డీనియా పార్క్​, సౌత్ గీలాంగ్) అక్టోబర్​ 22: శ్రీలంక Vs క్వాలిఫయర్​ ఏ4(కార్డీనియా పార్క్​, సౌత్ గీలాంగ్​) అక్టోబర్​ 23: క్వాలిఫయర్​ బీ2 Vs క్వాలిఫయర్​ బీ3 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా) అక్టోబర్​ 23: బంగ్లాదేశ్ ​Vs క్వాలిఫయర్​ బీ4 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)

సూపర్​-12 మ్యాచ్​లు….

ఇప్పటికే 8 అగ్రజట్లు ఇందులో చోటు దక్కించుకున్నాయి. తొలి రౌండ్​ పోటీలు ముగిశాక మిగతా 4 జట్లు ఇందులో కలుస్తాయి.

గ్రూప్​-1లో పాకిస్థాన్​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, వెస్టిండీస్​ జట్లు ఉన్నాయి. వీటికి ఏ1, బీ2(తొలిరౌండ్​ లిస్ట్ వైజ్) కలుస్తాయి.

గ్రూప్​-2లో భారత్​, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్​ జట్లు ఉన్నాయి. వీటికి బీ1, ఏ2 (తొలరౌండ్​ లిస్ట్ వైజ్) కలుస్తాయి.

అక్టోబర్​ 24: ఆస్ట్రేలియా Vs పాకిస్థాన్​ ( సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ) అక్టోబర్​ 24: భారత్​ Vs దక్షిణాఫ్రికా (పెర్త్​ స్టేడియం, పెర్త్​) అక్టోబర్​ 25: ఏ1 Vs బీ2 (బ్లండ్​ స్టోన్​ ఎరీనా, హోబర్ట్​) అక్టోబర్​ 25: న్యూజిలాండ్​ Vs వెస్టిండీస్​ (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​) అక్టోబర్​ 26: అఫ్గానిస్థాన్​ Vs ఏ2 (పెర్త్​ స్టేడియం, పెర్త్​) అక్టోబర్​ 26: ఇంగ్లాండ్​ ​ Vs బీ1 (పెర్త్​ స్టేడియం, పెర్త్​) అక్టోబర్​ 27: న్యూజిలాండ్​ Vs బీ2 (బ్లండ్​ స్టోన్​ ఎరీనా, హోబర్ట్​) అక్టోబర్​ 28: అఫ్గానిస్థాన్​ Vs బీ1 (పెర్త్​ స్టేడియం, పెర్త్​) అక్టోబర్​ 28: ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్​ (పెర్త్​ స్టేడియం, పెర్త్​) అక్టోబర్​ 29: పాకిస్థాన్​​ Vs ఏ1 (సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ) అక్టోబర్​ 29: భారత్​​​ Vs ఏ2 (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​) అక్టోబర్​ 30: ఇంగ్లాండ్​​​​ Vs దక్షిణాఫ్రికా ( సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ) అక్టోబర్​ 30: వెస్టిండీస్​​​​ Vs బీ2 (పెర్త్​ స్టేడియం​, పెర్త్​) అక్టోబర్​ 31: పాకిస్థాన్​​​​ Vs న్యూజిలాండ్​ (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​) అక్టోబర్​ 31: ఆస్ట్రేలియా​​​​ Vs ఏ1 (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​) నవంబర్ 1: దక్షిణాఫ్రికా ​​​Vs అఫ్గానిస్థాన్​ (అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​) నవంబర్ 1: భారత్​ ​​​Vs ఇంగ్లాండ్​ (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​) నవంబర్ 2: ఏ2 ​​Vs బీ1( సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ) నవంబర్ 2: న్యూజిలాండ్​ Vs ఏ1 (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​) నవంబర్ 3: పాకిస్థాన్​ Vs వెస్టిండీస్​(అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​) నవంబర్ 3: ఆస్ట్రేలియా Vs బీ2​(అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​) నవంబర్ 4: ఇంగ్లాండ్​ Vs అఫ్గానిస్థాన్​ (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​) నవంబర్ 5:దక్షిణాఫ్రికా ​​​Vs ఏ2​ (అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​) నవంబర్ 5:భారత్​​ Vs బీ2 ​(అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​) నవంబర్ 6: పాకిస్థాన్​ Vs బీ2 (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​) నవంబర్ 6: ఆస్ట్రేలియా​ Vs న్యూజిలాండ్​ (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​) నవంబర్ 7: ఇంగ్లాండ్​ vs ఏ2 (అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​) నవంబర్ 7: విండీస్​ Vs ఏ1(మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​) నవంబర్ 8: దక్షిణాఫ్రికా Vs బీ1 (సీడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ) నవంబర్ 8: భారత్​ Vs అఫ్గానిస్థాన్​ (సీడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)

  • సెమీఫైనల్స్​-ఫైనల్​ 

నవంబర్​ 11: సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ

నవంబర్​ 12: అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​

నవంబర్​ 15: మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!