కరోనా కట్టడి కోసం.. అక్కడ.. పాలు, మెడికల్ షాపులకే అనుమతి..!

కరోనా కట్టడి కోసం.. అక్కడ.. పాలు, మెడికల్ షాపులకే అనుమతి..!

Ahmedabad : కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతాకాదు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో అన్ని దుకాణాలూ మూతవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం పాలు, మెడిసిన్ అమ్మే దుకాణాలు మాత్రమే తెరవాలని, మిగతా దుకాణాలేవీ తెరవకూడదని తేల్చిచెప్పింది. కాగా.. ఈ నిబంధనలు మే 7 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 06, 2020 | 9:17 PM

Ahmedabad : కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతాకాదు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో అన్ని దుకాణాలూ మూతవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం పాలు, మెడిసిన్ అమ్మే దుకాణాలు మాత్రమే తెరవాలని, మిగతా దుకాణాలేవీ తెరవకూడదని తేల్చిచెప్పింది.

కాగా.. ఈ నిబంధనలు మే 7 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. కూరగాయల వంటి నిత్యావసరాలు అమ్మే దుకాణాలకు కూడా అనుమతులు లేవని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 4,425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.

Also Read: రైతులకు శుభవార్త.. వాళ్లందరికీ రుణ మాఫీ ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu