ఏపీలో ఒకేరోజు రెండు దారుణాలు.. ఇద్దరు ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేకపోతున్నాయి. మాయమాటలు చెప్పి ముక్కుపచ్చలారని చిన్నారులను కామాంధులు చిదిమేస్తున్నారు.

ఏపీలో ఒకేరోజు రెండు దారుణాలు.. ఇద్దరు ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యాలు
Follow us

|

Updated on: Nov 03, 2020 | 5:10 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేకపోతున్నాయి. మాయమాటలు చెప్పి ముక్కుపచ్చలారని చిన్నారులను కామాంధులు చిదిమేస్తున్నారు. కన్నుమిన్ను కానని కీచకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఆరేళ్ల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ బాలుడు (14) ఈ ఆకృత్యానికి తెగబడితే, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ కామాంధుడు (28) ఈ దారుణానికి ఒడిగట్టాడు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మేనమామ ఇంటికి విశాఖ జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు (14) వచ్చాడు. ఆదివారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ బాలికను (6) ఇంటిపక్కన డాబాపై ఆరేసిన దుస్తులు తీసుకువద్దామని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక అరుపులు విని మిగతా పిల్లలు రావడంతో అతను పారిపోయాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని వైద్యం నిమిత్తం ఏలేశ్వరం సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

అటు, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉంది. ఇదీ గమనించిన అదే గ్రామానికి చెందిన మహేష్‌ (28) ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్రపోయే సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గుర్తించి తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అనంతరం బాలికను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..