గేదె దొంగతనం.. ఎంపీపై కేసు నమోదు

గేదె దొంగతనం.. ఎంపీపై కేసు నమోదు

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజమ్ ఖాన్‌ తమ గేదెను దొంగలించారంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తన ఇంటికి వచ్చిన అజంఖాన్, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని వారు ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో పాటు రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని వారు అభియోగంలో తెలిపారు. దీంతో అతడిపై కేసు నమోదు అయింది. ఆయనతో పాటు మాజీ అధికారి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 9:27 AM

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజమ్ ఖాన్‌ తమ గేదెను దొంగలించారంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తన ఇంటికి వచ్చిన అజంఖాన్, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని వారు ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో పాటు రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని వారు అభియోగంలో తెలిపారు. దీంతో అతడిపై కేసు నమోదు అయింది. ఆయనతో పాటు మాజీ అధికారి అలయ్‌ హసన్‌, మరో నలుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఉంచారు. మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను అందులో చేర్చారు.

ఆ ఇంటి స్థలం తనకు కావాలంటూ ఆజమ్‌ ఖాన్‌ తన అనుచరులతో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నిజానికి ఆ స్థలం తమదే అని.. అందుకు తగిన రిజిస్టర్ పేపర్లు కూడా ఉన్నాయని.. కానీ స్కూలు నిర్మించడం కోసం ఎంపీ తమపై ఒత్తిడి తెచ్చారన్నారు. ఇదిలా ఉంటే కేసుల విషయంలో ఇటీవలే ఆజమ్‌ ఖాన్‌కు చుక్కెదురైంది. అజంఖాన్‌పై నమోదైన 29కేసుల విషయంలో ఆయనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించారు. 29 కేసుల్లో 28కేసులు రైతులు పెట్టినవే కావడం గమనార్హం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu