రాయుడి రివర్స్ గేర్‌.. నెటిజన్ల సెటైర్

రాయుడి రివర్స్ గేర్‌.. నెటిజన్ల సెటైర్
ఇక 2019 ప్రపంచ కప్‌ జట్టుకు రాయుడు ఎంపిక కాకపోవడంతో పెద్ద వివాదం చోటు చేసుకుంది. రాయుడు అసంతృప్తితో బీసీసీఐపై తిరుగుబాటు చేశాడు. తద్వారా కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు. ప్రస్తుతం ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 55 వన్డేల్లో ఆడిన రాయుడు 47. 05 సగటుతో 1694 పరుగులు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

రిటైర్మెంట్‌‌‌‌‌పై రివర్స్ గేర్ తీసుకున్న రాయుడిపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అతడు భారత్ షాహిద్ ఆఫ్రిది అని కొంతమంది ఎగతాళి చేస్తుంటే.. మరికొందరు అతని ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మూడు విభాగాల్లో అవసరమవుతాడని విజయ్ శంకర్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. రాయుడికి మొండి చెయ్యి చూపించారు. దీంతో భావోద్వేగం చెందిన రాయుడు ప్రపంచకప్‌ వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ఎమ్ఎస్కె ప్రసాద్‌పై సెటైర్‌ విసిరాడు. ఇక ఆ తర్వాత రాయుడు, పంత్‌ను బ్యాకప్ ఆటగాళ్లుగా ఎంపిక […]

Ravi Kiran

| Edited By:

Aug 31, 2019 | 1:43 PM

రిటైర్మెంట్‌‌‌‌‌పై రివర్స్ గేర్ తీసుకున్న రాయుడిపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అతడు భారత్ షాహిద్ ఆఫ్రిది అని కొంతమంది ఎగతాళి చేస్తుంటే.. మరికొందరు అతని ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మూడు విభాగాల్లో అవసరమవుతాడని విజయ్ శంకర్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. రాయుడికి మొండి చెయ్యి చూపించారు. దీంతో భావోద్వేగం చెందిన రాయుడు ప్రపంచకప్‌ వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ఎమ్ఎస్కె ప్రసాద్‌పై సెటైర్‌ విసిరాడు.

ఇక ఆ తర్వాత రాయుడు, పంత్‌ను బ్యాకప్ ఆటగాళ్లుగా ఎంపిక చేయగా.. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు. అటు ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డ విజయ్ శంకర్ స్థానంలో అంబటి రాయుడిని ఎంపిక చేస్తారని అందరూ భావించినా.. అనూహ్యంగా ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్‌ను పిలిపించడం జరిగింది. దానితో భావోద్వేగానికి గురైన రాయుడు తక్షణమే అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఇక కొద్దిరోజుల క్రితం అతడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు రాయుడు ప్రకటించాడు. దీంతో ట్విట్టర్ వేదికగా కొందరు విమర్శలు గుప్పించారు.

‘వస్తాడు, వెళ్తాడు… మళ్లీ తిరిగొస్తాడు’, ‘భారత షాహిద్‌ అఫ్రిది ఇతడు’, ‘శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, మనీశ్‌ పాండే పరిస్థితి ఇదీ’, ‘ఇంకెన్ని సార్లు ఇలా డ్రామాలు వేస్తావ్‌ భయ్యా’, ‘ఇతడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, అందుకు చాలా పనిచేయాలి’ అని కామెంట్స్ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu