పోరాడిన కోహ్లీ… భారత్ స్కోర్ 264/5

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య చివరిదైన రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ(76; 163బంతుల్లో 10×4), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(55; 127బంతుల్లో 7×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పుజారా(6) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ప్రస్తుతానికి క్రీజులో హనుమ విహారి(42 బ్యాటింగ్‌), రిషబ్‌ పంత్‌(27 బ్యాటింగ్‌) ఉన్నారు. రెండో టెస్టులోనూ భారత్‌కు సరైన ఆరంభం […]

పోరాడిన కోహ్లీ... భారత్ స్కోర్ 264/5
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 4:43 AM

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య చివరిదైన రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ(76; 163బంతుల్లో 10×4), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(55; 127బంతుల్లో 7×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పుజారా(6) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ప్రస్తుతానికి క్రీజులో హనుమ విహారి(42 బ్యాటింగ్‌), రిషబ్‌ పంత్‌(27 బ్యాటింగ్‌) ఉన్నారు.

రెండో టెస్టులోనూ భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. పిచ్‌పై కాస్త పచ్చిక ఉండటంతో విండీస్‌ సారథి హోల్డర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ కష్టంగా ఉండడంతో ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ తొలి అరగంట పాటు ఆచితూచి ఆడుతూ వచ్చారు. కానీ కుదురుకునే ప్రయత్నంలోనే ఏడో ఓవర్‌లో కేఎల్(13) హోల్డర్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా(6) ఖాతా తెరవడానికి ఇబ్బంది పడ్డాడు. కాసేపటికే కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో బ్రూక్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికి స్కోరు 46/2. 17వ ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. మయాంక్‌తో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ వెంటనే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. మయాంక్‌ మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డా మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ మరింత సాధికారికంగా ఆడాడు. వీలైనప్పుడు బౌండరీలు రాబట్టాడు. కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో కాస్త అసౌకర్యంగా కనిపించినా కోహ్లీ కూడా పట్టుదలగా నిలిచాడు. లంచ్‌ సమయానికి స్కోరు 72/2. విరామం తర్వాత బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ వేగం పెంచారు. రోచ్‌ ఓవర్లో రెండు ఫోర్లతో మయాంక్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ కాసేపటికే హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.