వరుణ్‌, అభిషేక్‌లతో కలిసి సచిన్‌ గల్లీ క్రికెట్‌

వరుణ్‌, అభిషేక్‌లతో కలిసి సచిన్‌ గల్లీ క్రికెట్‌

టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ముంబైలో సందడి చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ కార్యక్రమానికి మద్దతు పలికారు. మెహబూబా స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్‌ హీరోలు వరుణ్‌ ధావన్‌, అభిషేక్‌ బచ్చన్‌లను..మీరు కూడా జాయిన్‌ అవుతారా అని సచిన్‌ అడగడంతో సరదాగా క్రికెట్‌ ఆడారు. ముందు వరుణ్‌, జూనియర్‌ బచ్చన్‌ బౌలింగ్‌ చేయగా..మాస్టర్‌ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 30, 2019 | 5:13 PM

టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ముంబైలో సందడి చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ కార్యక్రమానికి మద్దతు పలికారు. మెహబూబా స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్‌ హీరోలు వరుణ్‌ ధావన్‌, అభిషేక్‌ బచ్చన్‌లను..మీరు కూడా జాయిన్‌ అవుతారా అని సచిన్‌ అడగడంతో సరదాగా క్రికెట్‌ ఆడారు.

ముందు వరుణ్‌, జూనియర్‌ బచ్చన్‌ బౌలింగ్‌ చేయగా..మాస్టర్‌ బ్లాస్టర్‌ బ్యాటింగ్‌ చేశారు. ఆ తర్వాత జియా అనే మహిళా యువ క్రికెటర్‌ను ఎంకరేజ్‌ చేశారు సచిన్‌. ఆ అమ్మాయి బౌలింగ్‌ చేస్తుండగా వరుణ్‌, అభిషేక్‌ బ్యాటింగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ సందర్భంగా గల్లీలో క్రికెట్‌ ఆడటం ఆనందంగా ఉందన్న సచిన్‌ ట్వీట్‌కు వరుణ్‌ కూడా రిప్లై ఇచ్చారు. స్పోర్ట్స్‌ ప్లేయింగ్‌ నేషన్‌ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu