రాయుడి కోపం తగ్గింది.. మరి సెలెక్టర్ల మాటేంటి..!

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అలకబూనాడు. ‘‘ఏదో భావోద్వేగంలో రిటైర్మెంట్ చేశా.. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా’’ అని ప్రకటించాడు. తనతో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని, తిరిగి జట్టులోకి వచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. అంతేకాదు కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచి, తనలో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉందని తెలిసేలా చేసిన సీఎస్కే జట్టుతో పాటు మాజీ ఆటగాళ్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలను తెలిపాడు. ఇక అన్ని పార్మట్లలోనూ […]

రాయుడి కోపం తగ్గింది.. మరి సెలెక్టర్ల మాటేంటి..!
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 3:23 PM

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అలకబూనాడు. ‘‘ఏదో భావోద్వేగంలో రిటైర్మెంట్ చేశా.. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా’’ అని ప్రకటించాడు. తనతో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని, తిరిగి జట్టులోకి వచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. అంతేకాదు కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచి, తనలో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉందని తెలిసేలా చేసిన సీఎస్కే జట్టుతో పాటు మాజీ ఆటగాళ్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలను తెలిపాడు. ఇక అన్ని పార్మట్లలోనూ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.

ఇదంతా పక్కనపెడితే టీమిండియాలో రాయుడును ఎప్పుడు తీసుకుంటారు..? అన్నది మరో ప్రశ్నగా మారింది. వరల్డ్‌కప్ నేపథ్యంలో సెలక్టర్లపై పరోక్ష విమర్శలు చేసిన రాయుడును.. ఇప్పుడు వారు ఎంతవరకు స్వాగతిస్తారో చూడాలి. అలాగే అతడు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో టీమిండియాలో ఉన్న ఆటగాళ్లు ఎవరు పెద్దగా స్పందించలేదు. స్పందించిన వారు కూడా ఆల్ ది బెస్ట్ మాత్రమే చెప్పారు. కేవలం మాజీలు మాత్రమే రాయుడుకు మద్దతుగా కామెంట్లు చేశారు. ఇలాంటి నేపథ్యంలో అతడిని టీమిండియాలోకి తీసుకున్నా.. మిడిల్ ఆర్టర్ కేటాయిస్తారా..? అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది. చూడాలి మరి రాయుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..! ఇదిలా ఉంటే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు రాయుడు హెచ్‌సీఏ, బీసీసీఐకు లేఖ రాయగా.. తాజాగా హెచ్‌సీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.