ప్రభాస్ ఫ్యాన్స్‌ను బాధ పెడుతోన్న ‘ఆదిపురుష్’‌ మేకర్స్, మార్కెట్‌ను అంచనా వేయడంలో విఫలం !

ప్రభాస్ మార్కెట్‌ స్టామినాను బాలీవుడ్ మేకర్స్ నమ్మటం లేదా..?. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది. బాహుబలి కలెక్షన్‌ స్టామినా మీదే హిందీ ఇండస్ట్రీలో...

ప్రభాస్ ఫ్యాన్స్‌ను బాధ పెడుతోన్న 'ఆదిపురుష్'‌ మేకర్స్, మార్కెట్‌ను అంచనా వేయడంలో విఫలం !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 30, 2020 | 12:54 PM

ప్రభాస్ మార్కెట్‌ స్టామినాను బాలీవుడ్ మేకర్స్ నమ్మటం లేదా..?. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది. బాహుబలి కలెక్షన్‌ స్టామినా మీదే హిందీ ఇండస్ట్రీలో అనుమానాలున్నాయా అన్న టాపిక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో వైరల్‌ అవుతుంది.  అదేంటి డార్లింగ్ క్రేజ్ మీద అనుమానాలా.. అసలు ఆ డౌట్ ఎందుకొచ్చాయ్‌..‌ అని మీరు అనుకోవచ్చు. ఆ విషయానికే వస్తున్నాం.

బాలీవుడ్‌లో ప్రభాస్‌ చేస్తున్న ఫస్ట్ స్ట్రయిట్ మూవీ ‘ఆదిపురుష్’‌. ఈ సినిమా కోసం డైరెక్టర్ సెట్ చేస్తున్న కాస్టింగ్ అస్సలు బాలేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌ లాంటి పాన్ ఇండియా స్టార్‌ సరసన ఏ మాత్రం ఇమేజ్‌ లేని కృతి సనన్‌ ఎందుకు తీసుకున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు‌. హీరోయిన్ సరే.. మిగతా రోల్స్ చూస్తే… లక్షణుడిగా ఎవరికీ తెలియని సన్నీ సింగ్ నటిస్తున్నాడు‌. రావణుడి కొడుకుగా హిందీలోనే క్రేజ్‌ లేని అంగద్‌ బేడీని తీసుకున్నారు.. ఇలా ఏ మాత్రం ఇమేజ్‌ లేని స్టార్స్‌ ను తీసుకోవటం చూస్తుంటే బడ్జెట్‌ తగ్గిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభాస్‌ మార్కెట్ మీద నమ్మకం లేకే బడ్జెట్‌ను కంట్రోల్‌ చేస్తున్నారా..? అని ఫీల్‌ అవుతున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. అంతేకాదు.. ‘ఇప్పటి వరకు ఓ లెక్క.. రాధే శ్యామ్ రిలీజ్ తరువాత మరో లెక్క’ అప్పుడైనా డార్లింగ్‌ రేంజ్‌ ఏంటో బాలీవుడ్ కు అర్ధమవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు