హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశ‌ర్మ మూవీ పాట‌కు మంచి రెస్పాన్స్‌.. ‘క్వశ్చన్ మార్క్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు

అందాల ముద్దుగుమ్మ అదాశ‌ర్మ‌‌కు ఆశించిన స్థాయిలో విజ‌యాలు అందుకోలేక‌పోతోంది. ఈ బ్యూటీ ‘హార్ట్ ఎటాక్’తో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఇప్పుడు అవ‌కాశాల కోసం ...

హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశ‌ర్మ మూవీ పాట‌కు మంచి రెస్పాన్స్‌.. ‘క్వశ్చన్ మార్క్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2020 | 7:56 AM

అందాల ముద్దుగుమ్మ అదాశ‌ర్మ‌‌కు ఆశించిన స్థాయిలో విజ‌యాలు అందుకోలేక‌పోతోంది. ఈ బ్యూటీ ‘హార్ట్ ఎటాక్’తో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఇప్పుడు అవ‌కాశాల కోసం ఈ అమ్మ‌డు ఎదురు చూస్తున్నారు. అనుకున్నంతగా ఆఫ‌ర్లు ద‌క్కించుకోలేక‌పోయింది. ఇత‌ర భాష‌ల్లోనూ అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తే.. తెలుగులో కూడా వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను చేసుకుంటూ వ‌స్తుండ‌గా, తాజాగా ? (క్వ‌శ్చ‌న్ మార్క్‌) అనే సినిమా చేస్తోంది. విప్రా డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గౌరీ కృష్ణ నిర్మించాడు. అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకునేలా ఈ సినిమా ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా, ఈ మూవీ నుంచి రామ‌స‌క్క‌నోడివిరో అనే పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌ఘు కుంచే సంగీతం అందించిన ఆ పాట‌ను మంగ్లీ పాడ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. పాట జ‌నాల్లో మంచి ఆస‌క్తి క‌లిగించింది. దీంతో ప్ర‌ముఖ ఓటీటీ ఈ సినిమాను మంచి రేటులో కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు నిర్మాత గౌరీ కృష్ణ తెలిపారు. ఇటీవ‌ల చేసిని మా చిత్రంలోని పాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు వెల్ల‌డించారు.