ఆ విషయంలో ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు

తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్‌లలో రాశి ఒకరు. దాదాపు అన్ని సినిమాల్లోనూ సంప్రదాయ పాత్రల్లో నటించినా.. 'నిజం' సినిమాలో మాత్రం బోల్డ్ పాత్రలో కనిపించి అందర్నీ షాక్‌కు..

ఆ విషయంలో ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 24, 2020 | 10:25 PM

తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్‌లలో రాశి ఒకరు. దాదాపు అన్ని సినిమాల్లోనూ సంప్రదాయ పాత్రల్లో నటించినా.. ‘నిజం’ సినిమాలో మాత్రం బోల్డ్ పాత్రలో కనిపించి అందర్నీ షాక్‌కు గురిచేశారు. అయితే దానికో కారణముందని తాజాగా వెల్లడించారు రాశి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిజం’. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు రాశి. అయితే ఆ పాత్రకు కొంతమంది ప్రశంసించగా.. మరికొంతమంది విమర్శించారు. అయితే దీని ఈ సినిమా గురించి తెర వెనుక ఏం జరిగిందో రాశి తెలిపారు.

తనకు ముందు చెప్పిన కథతో కాకుండా ఆ పాత్ర శైలి మార్చేసి.. డైరెక్టర్ మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రీకరణ మొదటి రోజే వెళ్లిపోదామనుకున్నానని.. అయితే అప్పటికే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల ఆ చిత్రంలో నటించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ పాత్రలో నటించినందుకు మంచి మార్కులు వచ్చినా.. అలాంటి పాత్రలో మళ్లీ చేయొద్దని ఆమె అభిమానులు సూచించారని చెప్పారు. అలాగే ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నదియా లాంటి పాత్రలను చేయడానికి సిద్ధమని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రాశి.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్