రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరిన నటి పాయల్‌ ఘోష్‌

పాయల్‌ ఘోష్‌ గుర్తున్నారు కదా! అదేనండి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేశారే ఆవిడే! ఇప్పుడామె ప్రస్తావన ఎందుకంటే రాజకీయాల్లో చేరారు కాబట్టి! రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవలే)లో చేరారు..కేంద్రమంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత రాందాస్‌ అథవలే సమక్షంలోనే ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇప్పుడామె ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలు.. పాయల్‌ ఘోష్‌ సినీ కెరీర్‌ మొదలయ్యిందే టాలీవుడ్‌ ఉంచి.. బెంగాల్‌కు చెందిన ఈమె ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన […]

రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరిన నటి పాయల్‌ ఘోష్‌
Balu

|

Oct 26, 2020 | 4:52 PM

పాయల్‌ ఘోష్‌ గుర్తున్నారు కదా! అదేనండి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేశారే ఆవిడే! ఇప్పుడామె ప్రస్తావన ఎందుకంటే రాజకీయాల్లో చేరారు కాబట్టి! రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవలే)లో చేరారు..కేంద్రమంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత రాందాస్‌ అథవలే సమక్షంలోనే ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇప్పుడామె ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలు.. పాయల్‌ ఘోష్‌ సినీ కెరీర్‌ మొదలయ్యిందే టాలీవుడ్‌ ఉంచి.. బెంగాల్‌కు చెందిన ఈమె ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ఊరసవెల్లిలో మెరిశారు.. ఆ సినిమాలో తమన్నా ఫ్రెండ్‌గా నటించిన పాయల్‌ తర్వాత మిస్టర్‌ రాస్కెల్‌లో నటించారు.. ఇక ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌ బాటపట్టారు. అక్కడ కొన్ని సినిమాలు కొన్ని వెబ్‌ సిరీస్‌లు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యకారణం దేశానికి సేవ చేయాలన్న తలంపుతోనేనని పాయల్‌ చెప్పుకొచ్చారు.. అనురాగ్‌ కశ్యప్‌ ఎపిసోడ్‌లో తనకు మద్దతు పలికి.. అండగా నిలిచిన వ్యక్తి రాందాస్‌ అథవలేనని అన్నారు. పాయల్‌ ఘోష్‌ చేరికతో పార్టీ బలోపేతం అయ్యిందని రాందాస్‌ అన్నారు. ఇది బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పార్టీ అని, ఇది అన్ని వర్గాల ప్రజలకు సాయం చేస్తుందని చెప్పారు. తన మీద వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న అనురాగ్‌ కశ్యప్‌ త్వరలో అరెస్ట్‌ కావడం ఖాయమన్నారు రాందాస్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu