Aadhaar link to Srinidhi Loans: ఆధార్ నెంబర్ లేకుంటే వడ్డీ రాయితీ కట్.. పంచాయతీ రాజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ
పేదలకు సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని కూడా ప్రతిష్ఠాత్మకం అమలు చేస్తోంది.
Aadhaar link to Srinidhi Loans: పేదలకు సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని కూడా ప్రతిష్ఠాత్మకం అమలు చేస్తోంది. అయితే ‘ఆధార్’ చట్టానికి ఇటీవల చేసిన సవరణలను దృష్టిలో పెట్టుకుని ఇకపైన మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే విధిగా ఆధార కార్డు నెంబర్ కలిగి ఉం డాల్సిందేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
స్ర్తీనిధి బ్యాంకు ద్వారా రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) వడ్డీ రాయుతీ పొందడానికి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ నెంబర్ లేకపోతే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న నెంబర్‌ను పొందుపరచవచ్చని తెలిపారు. అదికూడా లేకపోతే ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు బ్యాంకు పాసుపుస్తకం, పాన్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్ కార్డు, ఓటరుకార్దు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, కిసాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటివి విధిగా అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అధిక వడ్డీ రుణ భారం నుండి మహిళా సంఘాల సభ్యులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ నిధి పథకాన్ని చేపట్టింది. రాష్ట్రంలో నివసిస్తున్న అత్యంత నిరుపేద కుటుంబాలు అంటే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, స్త్రీ యాజమాన్య కుటుంబాలు (ఒంటరి స్త్రీలు), వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు, భూమి లేని కుటుంబాల వారికి ఆదాయాభివృద్ధి కోసం అప్పు అందించాలని ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.
ఒక సంఘానికి గరిష్టంగా రూ.1,50,000, ఒక సభ్యురాలికి రూ.15,000 రుణ రూపంలో ఇస్తారు. సకాలంలో మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన మొత్తాన్ని ఆ పథకం ద్వారా పొందొచ్చు. ఈ పథకం కింద ఇచ్చే రుణాల్లో 50 శాతం రుణం నిరుపేద, పేద సంఘాల సభ్యులకు అందించొచ్చు. అత్యవసర సమయంలో కనీస అవసరాలకు, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు, వినిమయ అవసరాలకు 48 గంటల్లో ఈ పథకం కింద రుణం మంజూరు చేస్తారు.
స్త్రీ నిధి కింద ఇచ్చే రుణాలు మహిళా సంఘాల సభ్యులు తమ పిల్లల విద్యావసరాలకు, కుటుంబ వైద్య అవసరాలకు, వినియోగ అవసరాలకు, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. పిల్లల చదువులు, పిల్లల పెళ్లి కోసం గరిష్టంగా రూ.25,000 రుణం పావలా వడ్డీకే ఈ పథకం ద్వారా ఇస్తారు. పాడి గేదేల పెంపకం కోసం గరిష్టంగా రూ.25,000 తదితర అత్యవసరాలకు రూ.15,000 వరకూ రుణం పావలా వడ్డీకే ఇస్తారు. ఈ మొత్తాన్ని 24 నెలల్లో వాయిదా రూపంలో తిరిగి చెల్లించాలి. ప్రస్తుత సంఘంలో ఆరుగురు నిరుపేద మహిళా సభ్యులకు మాత్రమే అప్పు మంజూరు చేస్తారు. స్త్రీనిధి రుణాలకు కూడా ఏప్రిల్, 2013 నుండి వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి.
ఇదిలావుంటే ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలన్నా ఇదే విధానాన్ని అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ మహిళ ఈ పథకం కింద గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణం తీసుకునే సౌలభ్యం ఉంది.
Read Also…