AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Raped Minor Girl: బాబా ముసుగులో బాలికపై లైంగికదాడి.. పోలీసుల అదుపులో ఆత్మారాం మహరాజ్‌.. పోక్సో చట్టం కింద కేసు!

ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు .. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.

Baba Raped Minor Girl: బాబా ముసుగులో బాలికపై లైంగికదాడి.. పోలీసుల అదుపులో ఆత్మారాం మహరాజ్‌.. పోక్సో చట్టం కింద కేసు!
Baba Athmaram Maharaj Arrested For Raping Minor Girl
Balaraju Goud
|

Updated on: Jun 23, 2021 | 8:34 AM

Share

Baba Athmaram Maharaj Raped Minor Girl: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు .. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.

జిల్లాలోని నేరడిగొండ మండలం రాజూర సమీపంలో కొండపై శివాలయం సమీపంలోని కొండపై ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్‌ పేరు చెప్పుకుంటూ నివాసముంటున్నాడు. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. అదును చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాబా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు.

బాబాను దేవుడిగా భావించింది ఆ అమాయకపు బాలిక. ఈ క్రమంలోనే బాబాకు పూజలు చేసి పండ్లు ఇచ్చేందుకు రాజురా సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక వెళ్లింది. ఈనెల 16న రాత్రి 8 గంటలకు ఆత్మారాం మహరాజ్ వద్దకు వెళ్లి తిరిగిరాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎదురుచూసి ఉదయం వెళ్లి చూడటంతో ఆత్మారాం ఆలయంలో స్పహ కోల్పోయి కనిపించింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో బాబా అసలు బండారం బయటపడింది.

కాగా, జరిగిన వ్యవహారానికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మరాం మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read Also…  Groom Beaten: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.. విషయం తెలిసి అబ్బాయిని చితకబాదిన అమ్మాయి కుటుంబసభ్యులు