Viral Video: కరోనా కాలపు చదువులు ఇలాగే ఉంటాయి.! వైరల్‌ అవుతోన్న చిన్నారి మాటలు. హోం వర్క్‌ తప్పించుకోవడానికి.

Viral Video: కరోనా మహమ్మారి యావత్‌ మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో...

Viral Video: కరోనా కాలపు చదువులు ఇలాగే ఉంటాయి.! వైరల్‌ అవుతోన్న చిన్నారి మాటలు. హోం వర్క్‌ తప్పించుకోవడానికి.
Girl Child Video Viral
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jul 17, 2021 | 1:55 PM

Viral Video: కరోనా మహమ్మారి యావత్‌ మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. చరిత్రలో మునుపెన్నడూ విద్యా రంగానికి ఇలాంటి ప్రతికూలత ఎదురై ఉండి ఉండదు. ఏకంగా రెండు అకడామిక్‌ ఇయర్స్‌పై దీని ప్రభావం పడింది. విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నా వారిలో నైపుణ్యాలు మాత్రం పెరగడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట కొన్ని పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నా అవి చిన్నారుల్లో విషయ పరిజ్ఞానాన్ని మాత్రం పెంచలేకపోతున్నాయి. ఇక కొంతమంది చిన్నారులు తాము ప్రస్తుతం ఏ తరగతి చదువుతున్నామో కూడా మర్చిపోయే పరస్థితులు వచ్చాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలోనే కరోనా చదువులు ఎలా మారాయో చెప్పడానికి ఓ వీడియో అద్దం పడుతోంది.

శనాయా అనే ఓ పాపను తన తల్లి.. ‘శనాయా నీకు టీచర్‌ ఎంత హోం వర్క్‌ ఇచ్చారు’ అని ప్రశ్నిస్తుంది. దీనికి ఆ చిన్నారి ‘నాకు నాకు టీచర్‌ హోం వర్క్‌ ఇవ్వదు అమ్మ’ అని బదులిచ్చింది. దీంతో ఆ చిన్నారి తల్లి ఆశ్చర్యంగా.. అదేంటి హోం వర్క్‌ ఎందుకు ఇవ్వరు అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు ఆ చిన్నారి స్పందిస్తూ.. ‘నేను మా టీచర్‌ను బ్లాక్‌ చేశాను’ కాబట్టి నాకు హోం వర్క్‌ రాదు’ అనే ఫన్నీ ఆన్సర్‌ ఇచ్చింది. దీనంతటినీ ఆ చిన్నారి తల్లి వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. చిన్నారి బుజ్జి బుజ్జి మాటలకు ఫిదా అవుతుంటే మరికొందరు మాత్రం కరోనా కారణంగా పిల్లల చదువులు ఏమవుతాయో అని ఆందోళన చెందుతున్నారు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఆ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి..

వైరల్‌గా మారిన వీడియో..

Also Read: Mahabubabad: పాపం ఈ పెద్దాయన ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి

Minister Harish Rao: మంత్రి హరీష్ రావు రాకతో.. ఆ ఇంట, ఆ ఊరంతా ఆనందం విరిసింది…

BP Diabetes: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? అదుపులో ఉంచుకోవాలంటే ఇవి పాటించాలంటున్న వైద్య నిపుణులు

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు