Telugu News » Latest news » A video goes viral in social media where crocodile eaten a dog
కుక్కను మింగేసిన ముసలి.. సోషల్ మీడియాలో వైరల్
Ravi Kiran | Edited By: Anil kumar poka
Updated on: Mar 20, 2019 | 8:57 PM
పంటపొల్లాలోకి మొసలి వచ్చిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మణచాంద మండలం పారుపెల్లి గ్రామం శివారులోని పంటపొలాల్లో మెుసలి ప్రత్యేక్షమయ్యింది. గుర్రపు డెక్క పేరుకుపోయిన ప్రదేశంలో ఆహరం కోసం వెళ్లిన కుక్కను.. మొసలి అమాంతం మింగేసింది. ఇలానే మంగళవారం కూడా ఓ మేకను చంపేసింది. కాగా మెుసలి కుక్కను మింగేస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు జనసంచారం మధ్య కన్నెమ్మ చెరువులో మొసలి రావడంతో […]
పంటపొల్లాలోకి మొసలి వచ్చిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మణచాంద మండలం పారుపెల్లి గ్రామం శివారులోని పంటపొలాల్లో మెుసలి ప్రత్యేక్షమయ్యింది. గుర్రపు డెక్క పేరుకుపోయిన ప్రదేశంలో ఆహరం కోసం వెళ్లిన కుక్కను.. మొసలి అమాంతం మింగేసింది. ఇలానే మంగళవారం కూడా ఓ మేకను చంపేసింది. కాగా మెుసలి కుక్కను మింగేస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు జనసంచారం మధ్య కన్నెమ్మ చెరువులో మొసలి రావడంతో కలకలం రేపుతోంది. స్థానికులు ఆందోళనకు గురి చేస్తోంది. మొసలిని వెంటనే బంధించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.