‘నా బుర్ఖా నా ఇష్టం’..రైటర్ తస్లీమాకు రెహమాన్ కుమార్తె ఖతీజా కౌంటర్
సోషల్ మీడియాలో తరచు తను చేసే వ్యాఖ్యలతో వివాదాలకెక్కే బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అప్పుడప్పుడు ‘బుట్టలో ‘పడుతుంటారు. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతీజా బుర్ఖా ధరించి ఉన్న ఫోటోను చూసిన ఆమె .. రెహమాన్ సంగీతాన్ని తానెంతో ఇష్ట పడతానని, అయితే ఆయన కూతురిని చూసినప్పుడల్లా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నట్టు ఫీలవుతానని ట్వీట్ చేసింది. ‘ఒక కల్చరల్ కుటుంబానికి చెందిన విద్యావంతురాలైన మహిళ కూడా ఇలా బుర్ఖా ధరించడం […]
సోషల్ మీడియాలో తరచు తను చేసే వ్యాఖ్యలతో వివాదాలకెక్కే బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అప్పుడప్పుడు ‘బుట్టలో ‘పడుతుంటారు. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతీజా బుర్ఖా ధరించి ఉన్న ఫోటోను చూసిన ఆమె .. రెహమాన్ సంగీతాన్ని తానెంతో ఇష్ట పడతానని, అయితే ఆయన కూతురిని చూసినప్పుడల్లా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నట్టు ఫీలవుతానని ట్వీట్ చేసింది. ‘ఒక కల్చరల్ కుటుంబానికి చెందిన విద్యావంతురాలైన మహిళ కూడా ఇలా బుర్ఖా ధరించడం చాలా బాధిస్తుంది’ అని తస్లీమా పేర్కొన్నారు. వీరికి సులభంగా బ్రెయిన్ వాష్ చేయవచ్చు అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ ట్వీట్ పై ఖతీజా .. ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తన దుస్తులు, తన ఆహార్యం తన ఇష్టమని, తన పధ్దతి నచ్చినవారికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొంది. నా బుర్ఖాను చూసి.. మీరు ఊపిరి తీసుకోలేకపోతున్నా.. తానేమీ అలా ఫీల్ కావడంలేదని అంటూ ‘ కాస్త ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని’ సలహా ఇచ్చింది. అసలు ఫెమినిజం అంటే ఏమిటో గూగుల్‌లో వెతకండి.. అయినా మీ పరిశీలన కోసం నా ఫొటోలేవీ పంపను లెండి’ అని ఖతీజా ఘాటుగా రిప్లై ఇచ్చింది.
కాగా-రెహమాన్ రెండో కూతురు రహీమా.. ‘నేనేమీ బుర్ఖా ధరించలేదు. మేం ఒకరి అభిప్రాయాలను ఒకరం ఎలా గౌరవిస్తామో చూడండి’ అంటూ తన తండ్రి, సోదరితో కూడిన ఫోటోను పోస్ట్ చేసింది.