Ap Local Body Elections: పంచాయతీ ఎన్నికల్లో 92 ఏళ్ల బామ్మ నామినేషన్‌.. “సీఎం జగన్ పథకాల చూసే బరిలోకి”

ఆంధ్రప్రదేశ్‌లో‌ పంచాయతీ ఎన్నికల హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు సామ, ధాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు.

Ap Local Body Elections: పంచాయతీ ఎన్నికల్లో 92 ఏళ్ల బామ్మ నామినేషన్‌.. సీఎం జగన్ పథకాల చూసే బరిలోకి
Follow us

|

Updated on: Feb 06, 2021 | 11:45 AM

Ap Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో‌ పంచాయతీ ఎన్నికల హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు సామ, ధాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల తాయిలాల పంపకాలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. కాగా తాజాగా తూర్పుగోదావరి జిల్లా వృద్ధురాలు వార్డు మెంబర్‌ బరిలోకి దిగడం  సంచలనంగా మారింది.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ 8వ వార్డు సభ్యురాలి పదవి కోసం 92 ఏళ్ల బామ్మ నామినేషన్‌ వేశారు. మాధవరాయుడు గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీనరసమ్మ తన నామినేషన్‌ను 4 వ తేదీన స్టేజ్‌-1 అధికారికి అందజేశారు. వృద్ధురాలి నామినేషన్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి  జగన్ పథకాలు చూసి వార్డులోని ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంతోనే బరిలోకి దిగానని 93 ఏళ్ల లక్ష్మీ నరసమ్మ చెబుతన్నారు.

మరోవైపు ఏపీ వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగనుండగా అందులో 452 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలినవాటికి ఈ నెల 9 న ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:

AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్​లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ తాయిలాల పరంపర.. భీమవరం మండలంలో భారీగా ప్రెషర్ కుక్కర్లు స్వాధీనం