IRCTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
IRCTC Launches: బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ఇప్పుడు
IRCTC Launches: బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ఇప్పుడు ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే రైల్వే, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులు కొనసాగిస్తున్న ఐఆర్‌సీటీసీ తాజాగా బస్సు టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ని కూడా ప్రారంభించింది. జనవరి 29 నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ ద్వారా బస్ బుకింగ్ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లను కూడా అనుసంధానం చేసుకొని ఈ సేవలను అందిస్తుంది. ఆన్‌లైన్ బస్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించింది.https://bus.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఇందులో బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా బస్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు ఐఆర్‌సీటీసీ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్లు బుక్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ లేకపోతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు. ఇక ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికుల పేరు మీద బస్సు టికెట్లు బుక్ చేయొచ్చు. వోల్వో బస్సు, ఏసీ, నాన్ ఏసీ బస్సుల టికెట్లు బుక్ చేయొచ్చు. ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.20+జీఎస్‌టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై రూ.10+జీఎస్‌టీ ఛార్జీ వసూలు చేస్తుంది.
ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. ఆ మంత్రిని ఈ నెల 21 వరకు హౌస్ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశం
Samantha Akkineni: ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతున్న సామ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..