AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణ గ్రహం తొలి ఇమేజ్ ని పంపిన చైనా ఉపగ్రహం, లోతైన ‘క్రేటర్ల’ తో నిండిన మార్స్,

చైనాకు చెందిన తియాన్ బెన్-1 ఉపగ్రహం అంగారకగ్రహానికి సంబంధించిన  తొలి ఇమేజీని పంపింది. గత ఏడాది జులైలో ఈ స్పేస్ క్రాఫ్ట్ ని చైనా ప్రయోగించింది.

అరుణ గ్రహం తొలి ఇమేజ్ ని పంపిన చైనా ఉపగ్రహం, లోతైన 'క్రేటర్ల' తో నిండిన మార్స్,
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 06, 2021 | 12:15 PM

Share

చైనాకు చెందిన తియాన్ బెన్-1 ఉపగ్రహం అంగారకగ్రహానికి సంబంధించిన  తొలి ఇమేజీని పంపింది. గత ఏడాది జులైలో ఈ స్పేస్ క్రాఫ్ట్ ని చైనా ప్రయోగించింది. ఇది ఈ నెల 10 న మార్స్ కక్ష్యలోకి ప్రవేశించవచ్చునని భావిస్తున్నారు. అరుణ గ్రహంపైని గల అతి పెద్ద లోయలు, గుట్టల వంటి ప్రాంతాలను ఈ ఇమేజీ చూపినట్టు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. మార్స్ నుంచి దాదాపు  14 లక్షల మైళ్ళ నుంచి ఈ ఫోటోలను ఉపగ్రహం తీసిందని, ప్రస్తుతం ఉపగ్రహం అంగారక గ్రహానికి 10 లక్షలకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉందని ఈ  సంస్థ వెల్లడించింది. 5 టన్నుల బరువైన చైనా ఉపగ్రహంలో ఆర్బిటర్, రోవర్, అత్యంత ఆధునిక కెమెరాలు తదితరాలున్నాయి.

అంగారక గ్రహం పైని మట్టిని ఇవి విశ్లేషించనున్నాయి. ఉపగ్రహంలోని రోవర్ ను వచ్ఛే మేనెలలో మార్స్ పై దింపవచ్చునని భావిస్తున్నారు. అంగారక గ్రహం పై పరిశోధనలకు అమెరికా, రష్యా, యూరప్, జపాన్, ఇండియా కూడా కృషి చేస్తున్నాయి. రష్యాతో కలిసి చైనా 2011 లో ఈ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపినా సక్సెస్ కాలేకపోయింది.  అయితే చంద్ర గ్రహంపై చైనా ఇప్పటికే రెండు రోవర్లను పంపింది. రెండో రోవర్ జయప్రదంగా ఈ ప్లానెట్ ఉపరితలంపై దిగడంతో…. ఇలా ఈ విషయంలో సక్సెస్ అయిన మొదటి దేశంగా చైనా నిలిచింది. డ్రాగన్ కంట్రీ తన అంతరిక్ష కార్యక్రమాలను అతి రహస్యంగా సాగించడం విశేషం. ఇతర దేశాలకు దీటుగా వీటిని నిర్వహిస్తున్నా చైనీయులు మాత్రం వీటిని చడీచప్పుడు కాకుండా నిర్వహించడం  వెనక తమ స్పేస్ ప్రోగ్రామ్స్ గురించి ఇతర దేశాలకు తెలియజేయరాదన్నదే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. china's space probe sends back its first image of mars, beijing, china space programme, tiyanben-1 spacecraft, mars, first image, craters, canons, china national space administration Read More: అంతర్జాతీయం

Read More: A Person Enjoys With Pythons Video: కొండచిలువల మధ్య ఎంజాయ్‌ చేస్తున్న వ్యక్తి వీడియో.