Camels Water: ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి?.. వాటి మూపురంలో ఏముంటుంది?

Camels without water: ఎడారులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఒంటెలు. ఏడారిలో నీళ్లు లేకుండా ఒంటేలు జీవించగలవు. అయితే వాస్తవానికి చెప్పాలంటే నీరు ...

Camels Water: ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి?.. వాటి మూపురంలో ఏముంటుంది?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2021 | 11:12 AM

Camels without water: ఎడారులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఒంటెలు. ఏడారిలో నీళ్లు లేకుండా ఒంటేలు జీవించగలవు. అయితే వాస్తవానికి చెప్పాలంటే నీరు లేకుండా రెండు వారాలకుపైగా జీవించగలవు. కానీ ఆహారం లేకుండా కనీసం ఐదారు నెలల వరకు జీవించగల్గుతాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీనికి ‘డెజర్ట్స్ షిప్స్’ అని అంటారు. అలాగే ఒంటెలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మూపురం. ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థం ఉండడమే కారణం. మండుటెండల్లో ఏ మాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవని జంతు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకుంటాయట. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంట్రిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలో ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే అరేబియన్‌ ఒంటెలకు ఒకటే మూపురం ఉంటుంది. కానీ ఆసియా ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి. అవి మూపురంలో కొవ్వును దాచుకుంటాయి. శరీరంలో కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దాని వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారు లాంటి వేడి ప్రదేశాల్లో అవి తిరిగినా, మంచి నీరు లేకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తాయి. జంతు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం..

ఒంటెల కనుగుడ్లకు, కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొరలాంటిది ఉంటుంది. ఎడారుల్లో తిరిగినప్పుడు ఇసుక కళ్లలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది. వీటి నోటి లోపల భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే ముళ్ల చెట్లను, కాయలను సైతం తిన్నా ఎలాంటి గాయాలు కావు. ఇసుక, దుమ్మ రేగిన సమయంలో నాసికారంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది. ఆవుపాలలో కంటే ఒంటె పాలలో కొవ్వ, చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అయితే ఇవి తాగడం వల్ల మంచిది కాదంటున్నారు. ఇవి చాలా చిక్కగా ఉండటం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు కావడం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒంటెలక చమట త్వరగా పట్టదు. ఒక వేళ చమట పట్టాలంటే ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటాల్సిందే.

Also Read: LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!