Ind vs Eng, 1st Test, Day 2: దంచికొడుతోన్న ఇంగ్లాండ్.. 600 పరుగుల చేరువలో ఇంగ్లీష్ టీమ్..

| Edited By: Ravi Kiran

Updated on: Feb 06, 2021 | 4:55 PM

India vs England, 1st Test, Day 2: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి..

Ind vs Eng, 1st Test, Day 2: దంచికొడుతోన్న ఇంగ్లాండ్.. 600 పరుగుల చేరువలో ఇంగ్లీష్ టీమ్..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్

India vs England, 1st Test, Day 2: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 555/8 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు

2021లో మూడు సెంచ‌రీలు

ఈ ఏడాది ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఆడిన ప్రతీ టెస్ట్‌లో సెంచ‌రీ చేయ‌డం గమనార్హం. ఇటీవల శ్రీలంక‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ రూట్ సెంచ‌రీలు చేశారు. రెండు టెస్టుల్లో కూడా 228, 186 ప‌రుగులు చేశాడు. ఇప్పుడు ఇండియాలోనూ త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Feb 2021 04:46 PM (IST)

    దంచికొడుతోన్న ఇంగ్లాండ్.. రికార్డు బ్రేక్ చేసిన జో రూట్..

    టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 555/8 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు.

  • 06 Feb 2021 04:26 PM (IST)

    వికెట్ కోసం వాషింగ్టన్ సుందర్ ప్రయత్నం.. క్యాచ్ జారవిడిచిన రోహిత్ శర్మ..

    25 ఓవర్లు పూర్తి చేసుకున్న వాషింగ్టన్ సుందర్.. తన మొదటి వికెట్ కోసం ఇంకా ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే తన 25 ఓవర్ మొదటి బంతికి బెస్ మిడ్ వికెట్‌ మీదుగా షాట్ కొట్టేందుకు ప్రయత్నించి.. రోహిత్ శర్మకు చక్కటి క్యాచ్ ఇచ్చాడు. అయితే దాన్ని కాస్తా హిట్ మ్యాన్ జారవిడిచాడు. ప్రస్తుతం 175 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 537/8 పరుగులు చేసింది.

  • 06 Feb 2021 04:02 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..

    జోరు మీదున్న ఇంగ్లాండ్‌కు టీమిండియా బౌలర్లు కళ్లెం వేశారు. భారీ షాట్లు కొడుతున్న జోస్ బట్లర్(30)ను పేసర్ ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడమే కాకుండా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆర్చర్‌(0)ను మొదటి బంతికే పెవిలియన్ చేర్చాడు. దీనితో ఇంగ్లాండ్ 170 ఓవర్లు ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 528 పరుగులు చేసింది.

  • 06 Feb 2021 03:43 PM (IST)

    ఇంగ్లాండ్ స్కోర్ 500 దాటింది.. బట్లర్ వికెట్ కీలకం..

    ఇంగ్లాండ్ స్కోర్ 500 మార్క్ దాటింది. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ.. ఇంగ్లీష్ టీమ్ అద్భుతంగా రాణించింది. కెప్టెన్ జో రూట్(218) భారీ డబుల్ సెంచరీ సాధించగా.. సిబ్లి(87), స్టోక్స్(82) రాణించారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పొప్(34), ఓపెనర్ బర్న్స్(33) కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. ప్రస్తుతం క్రీజులో బట్లర్(22), బెస్(7) ఉన్నారు. ఇక టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, నదీమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

  • 06 Feb 2021 03:33 PM (IST)

    అశ్విన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన బట్లర్..

    ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ రెండు చక్కటి ఫోర్లు బాదాడు. ఒకటి ఎక్స్‌ట్రా కవర్ మీదుగా.. ఇంకోటి ఔట్‌సైడ్ ఆఫ్‌లో మంచి షాట్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్(17) , బెస్(1) ఉన్నారు. 161 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ ఆరు వికెట్లు నష్టపోయి 493 పరుగులు చేసింది.

  • 06 Feb 2021 03:10 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..రూట్‌ (218)ను నదీమ్‌ ఎల్బీగా ఔట్ చేశాడు

    చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు‌ కోల్పోయింది. పోప్‌ (34)ను అశ్విన్‌ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కొద్దిసేపటికే రూట్‌ (218)ను నదీమ్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఇదిలావుంటే.. రూట్‌-పోప్‌ అయిదో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 154 ఓవర్లకు 477/6 స్కోరు సాధించింది. బట్లర్‌ (3), బెస్‌ క్రీజులో ఉన్నారు.

  • 06 Feb 2021 02:49 PM (IST)

    మూడవ సెషన్ ఆట ప్రారంభమైంది

    రెండవ రోజు చివరి సెషన్ ఆట చెన్నై టెస్ట్‌లో ప్రారంభమైంది. రూట్ , ఆలీ పోప్ క్రీజులో కొనసాగుతున్నారు. అదే సమయంలో.. ఈ సెషన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రారంభించాడు. ఈ ఓవర్లో మొత్తం 3 పరుగులు. రూట్ యొక్క బ్యాట్ నుండి 2 పరుగులు చేయగా, 1 పరుగు నో బంతి ద్వారా వచ్చింది.

  • 06 Feb 2021 02:37 PM (IST)

    టీ వరకు ఇంగ్లాండ్ స్కోరు - 454/4

    చెన్నై టెస్ట్‌లో రెండో రోజు వరకు టీ ఆట ముగిసింది. ఇంగ్లాండ్ 4 వికెట్లకు 454 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా 92 పరుగులు చేసిన ఇంగ్లండ్ రెండో సెషన్‌లో 1 వికెట్‌కు 99 పరుగులు జోడించింది. కెప్టెన్ జో రూట్ రెండో సెషన్‌లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 06 Feb 2021 02:03 PM (IST)

    ఇంగ్లాండ్ కెప్టెన్‌ రూట్‌ డబుల్ సెంచరీతో జోరు..

    టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ డబుల్ సెంచరీ చేశాడు. అశ్విన్‌ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన రూట్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదోసారి ఈ ఘనత సాధించాడు. అతడికి పోప్‌ సహకారంతో జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ 143 ఓవర్లకు 440/4తో కొనసాగుతోంది. అంతకుముందు బెన్‌స్టోక్స్‌(82) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శనివారం 263/3 ఓవర్‌నైట్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ ఇప్పుడు భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.

  • 06 Feb 2021 02:00 PM (IST)

    తొలి టెస్టులో భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లాండ్‌..

    చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ వీరవిహారం చేస్తున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. కెప్టెన్‌ జోరూట్‌(200), పోప్‌ నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు బెన్‌స్టోక్స్‌(82) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

  • 06 Feb 2021 01:45 PM (IST)

    చెపాక్‌ స్టేడియంలో ఇంగ్లాండ్ 400 పరుగులు..

    చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌ 400 పరుగులను చేరుకుంది. నదీమ్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌(82/ 117 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. జోరూట్‌(175), పోప్‌(5) నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో సెషన్‌లో డ్రింక్స్‌ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 132 ఓవర్లకు 400/4 స్కోర్‌తో నిలిచింది. అంతకుముందు రూట్‌తో కలిసి స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, నదీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ లైన్‌ సమీపంలో పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు 387 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

  • 06 Feb 2021 01:35 PM (IST)

    నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. ప్రస్తుత స్కోరు 400 పరుగులు

    చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ 400 పరుగులు పూర్తి చేసింది. ఈ భారీ స్కోర్ దశగా చేరుకోవడానికి నాలుగు వికెట్లను కోల్పోయింది. 82 పరుగులకు ఔటైన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇదిలావుంటే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఇప్పటికీ అజేయంగా కొనసాగుతున్నాడు.

  • 06 Feb 2021 01:12 PM (IST)

    రెండో సెషన్‌లో ఫలించిన భారత నిరీక్షణ.. స్టోక్స్ ఔట్..

    చెన్నై టెస్ట్ రెండో రోజు భారత వికెట్ కోసం నిరీక్షణ రెండో సెషన్‌లో ఫలించింది. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. వికెట్లు తీయ‌డంలో చాలా కష్టపడ్డారు. అయినా ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్ దారి పట్టించారు.

    82 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌ను స్పిన్న‌ర్ న‌దీమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట‌య్యాడు. స్వీప్ షాట్‌కు ప్ర‌య‌త్నించిన స్టోక్స్‌.. డీప్ లెగ్‌లో ఉన్న పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దాదాపు క్యాచ్‌ను వ‌దిలేసినంత ప‌ని చేసిన పుజారా.. చివ‌ర్లో ఆ క్యాచ్‌ను అందుకుని స్టోక్స్‌ను పెవిలియ‌న్‌కు పంపించాడు.

    స్టోక్స్‌, రూట్‌లు నాలుగ‌వ వికెట్‌కు 124 ర‌న్స్ జోడించారు. మ‌రో వైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్.. డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా ప‌య‌నిస్తున్నాడు. 175 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ 132 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 400 ర‌న్స్ చేసింది.

  • 06 Feb 2021 12:48 PM (IST)

    126 ఓవర్లు, 387 పరుగులు, 3 వికెట్లు

    చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 126 ఓవర్లు ఆడి 3 వికెట్లు కోల్పోయింది. 387 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 168 పరుగులతో అజేయంగా ఉండగా, స్టోక్స్ 81 పరుగులతో దూకుడు మీదున్నాడు.

  • 06 Feb 2021 12:42 PM (IST)

    చెన్నై స్టేడియంలో బెన్ స్టోక్స్ దూకుడు..

    చెన్నై స్టేడియంలో బెన్ స్టోక్స్ చెలరేగి ఆడుతున్నాడు. షాబాజ్ నదీమ్ బౌలింగ్ భారీ సిక్స్‌ను బాదాడు. ఈ సిక్స్ తో అతని స్కోరు 70 పరుగులు దాటి, ఇంగ్లాండ్ 370 పరుగులు దాటింది.

  • 06 Feb 2021 12:20 PM (IST)

    రెండవ సెషన్ గేమ్ ప్రారంభమైంది

    చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో, రెండవ సెషన్, లంచ్ విరామం తర్వాత తిరిగి ఆట ప్రారంభమైంది. కెప్టెన్ జో రూట్ మరియు బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నారు. ఇద్దరూ మంచి భాగస్వామ్యం దిశగా పరుగుల వరదల పారించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇషాంత్ శర్మ రెండో సెషన్‌లో భారత బౌలింగ్ ప్రారంభించాడు.

  • 06 Feb 2021 11:41 AM (IST)

    ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ దూకుడు.. నాలుగ‌వ వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో క‌లిసి..

    ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ దూకుడుమీదున్నాడు. చెన్నైలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు తొలి రోజు 150 పరుగులు చేసి నాటౌట్‌గా కొన‌సాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆట‌గాళ్లు రెండ‌వ రోజు కూడా టీమిండియా బౌల‌ర్ల‌పై ఒత్తిడి పెంచతున్నారుఎదుర్కొంటున్నారు. కెప్టెన్ జో రూట్‌.. 260 బంతుల్లో 150 పరుగులు చేశాడు. నాలుగ‌వ వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 114 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 337 ర‌న్స్ చేసింది. రూట్ 151, స్టోక్స్ 50 ర‌న్స్‌తో క్రీజ్‌లో కొనసాగుతున్నారు.

  • 06 Feb 2021 11:28 AM (IST)

    73 బంతుల్లో స్టోక్స్ హాఫ్ సెంచరీ..

    73 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బెన్ స్టోక్స్. బ్యాక్-టు-బ్యాక్ బౌండరీలతో స్టోక్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 06 Feb 2021 11:21 AM (IST)

    పిచ్ గురించి హర్ష భోగ్లే విశ్లేషణ..

    చెపాక్ వద్ద పిచ్ గురించి హర్ష భోగ్లే మాట్లాడుతూ...

  • 06 Feb 2021 11:16 AM (IST)

    ఫోర్లతో స్టోక్స్ అర్ధ సెంచరీ పూర్తి

    బెన్ స్టోక్స్ భారత స్పిన్నర్లపై తన దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈసారి, స్టోక్స్ నదీమ్‌ను టార్గెట్‌గా జోష్ పెంచాడు. తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు, తన మొదటి 2 బంతుల్లో 2 ఫోర్లు బ్యాక్ టు బ్యాక్ చేశాడు.

  • 06 Feb 2021 10:59 AM (IST)

    రెండో రివ్యూను కోల్పోయిన టీమిండియా

    షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో స్టోక్స్ లైఫ్ దొరికింది. ఎల్‌బిడబ్ల్యు సమీక్ష కోసం టీమిండియా విజ్ఞప్తి చేసింది. ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎటువంటి పరుగులు రాలేదు. ప్యాడ్‌ లోపలి అంచు తగిలింది. టీమిండియా మరో రివ్యూను కోల్పోయింది. రెండు రివ్యూలను కోల్పోయింది.

  • 06 Feb 2021 10:45 AM (IST)

    స్టోక్స్ బ్యాక్-టు-బ్యాక్ ఫోర్లు

    చెన్నై పిచ్‌ను స్టోక్స్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పరుగుల వేగం పెంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్.. బౌలింగ్ చేస్తున్న104 వ ఓవర్‌లో 2వ బంతుల్లో స్టోక్స్ బ్యాక్-టు-బ్యాక్ ఫోర్లు కొట్టాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు కూడా 300 పరుగులు దాటింది.

  • 06 Feb 2021 10:26 AM (IST)

    ఇషాంత్ ఓవర్లో రూట్‌కు లైఫ్ దొరికింది

    ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ యొక్క 102 వ ఓవర్లో, కెప్టెన్ జో రూట్ ఇషాంత్ శర్మ బంతికి బలమైన ఎల్బిడబ్ల్యు అప్పీల్ చేయడంతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే, బంతి లెగ్ స్టంప్ నుండి నిష్క్రమించడంతో ఫీల్డ్ అంపైర్ ఈ అప్పీల్‌ను తిరస్కరించారు. ఈ ఓవర్‌లో ఇషాంత్‌ పరుగులు ఇవ్వలేదు.

  • 06 Feb 2021 10:21 AM (IST)

    అశ్విన్ బౌలింగ్‌లో స్టోక్స్ 'స్వీప్' చేశాడు

    ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 101 వ ఓవర్ కొనసాగుతోంది. అశ్విన్ మంచి దూకుడులో ఉన్నాడు.. స్టోక్స్ ను కట్టడి చేసేందుకు దాడి చేస్తున్నాడు. అయితే ఇదే ఓవర్ మూడో బంతికి బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫోర్ కొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను స్వీప్ షాట్ ద్వారా బౌండరీ పొందాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 3 వికెట్లకు 290 కి చేరుకుంది.

  • 06 Feb 2021 10:17 AM (IST)

    ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచుతున్న కోహ్లీ సేన

    ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కోహ్లీ సే ప్రయత్నిస్తోంది. మంచి లెంత్ తో బౌలింగ్ వేస్తున్నారు. కానీ జో రూట్, స్టోక్స్ నిలకడగా ఆడుతున్నారు.

  • 06 Feb 2021 10:08 AM (IST)

    కెప్టెన్ జో రూట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఇషాంత్...

    ఇషాంత్ టు జో రూట్(కెప్టెన్), రన్ లేదు, ఎల్‌బిడబ్ల్యు కోసం బిగ్గరగా అప్పిల్ చేశాడు. అంపైర్ మీనన్ ఒప్పించలేదు. కోహ్లీ, ఇశాంత్, పంత్‌ చేసి సమీక్షకు వ్యతిరేకంగా నిర్ణయం రాలేదు. నిప్స్ తిరిగి తీవ్రంగా మరియు రూట్ ఫ్లిక్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు పడిపోతుంది, లెగ్-స్టంప్కు అనుగుణంగా ప్యాడ్లపై ర్యాప్ చేయబడింది. బంతి-ట్రాకింగ్ ప్రకారం LBW లేదు.

  • 06 Feb 2021 10:01 AM (IST)

    అశ్విన్‌ను టార్గెట్ చేస్తున్న స్టోక్స్ ..

    బెన్ స్టోక్స్ బుమ్రా ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. అయితే, స్ట్రోక్స్.. అశ్విన్‌పై దాడి చేసేందుకు రెడీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అతను తన 5 వ బంతికి లాంగ్ ఆఫ్ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 3 వికెట్లకు 280 కి చేరుకుంది.

Published On - Feb 06,2021 4:46 PM

Follow us
Latest Articles
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి