బ్రెజిల్‌లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 51 వేల కరోనా కేసులు..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో 51 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 1,211 మంది కరోనా సోకి మృతి చెందారు.

Cronavirus In Brazil: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో 51 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 1,211 మంది కరోనా సోకి మృతి చెందారు. లాటిన్ అమెరికాలో ఇప్పటివరకు 23 లక్షల 94 వేల 513 కేసులు నమోదవగా.. 86,వేల 449 మంది మృతిచెందారు. 16 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కాగా అంతకుముందు రోజు బ్రెజిల్‌లో కొత్తగా 55,891 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారంలో ఎనిమిది వేలకు పైగా బాధితులు మృతి చెందారు.
Read More:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..