కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రోజురోజుకు కేసులు భారీగా  నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 216 అంబులెన్సులు కోవిడ్‌ సేవలకు

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 11:24 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అయినా, రోజురోజుకు కేసులు భారీగా  నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 216 అంబులెన్సులు కోవిడ్‌ సేవలకు వినియోగిస్తున్నారు. కోవిడ్‌ లక్షణాలున్న వారిని, పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ఆస్పత్రులకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం 731 వాహనాలుండగా.. 216 అంబులెన్సులు ప్రత్యేకించి కోవిడ్‌ సేవలకు వినియోగిస్తున్నారు.

కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ రోగుల నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంది కాబట్టి ఈ వాహనాలు ఈ సేవలకే పరిమితం చేశారు. మిగతా 515 వాహనాలను ఎమర్జెన్సీ సేవలకు వినియోగిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు ముందే నిర్ణయించినవి కాబట్టి చిరునామాను బట్టి అంబులెన్సులు వెళతాయి. మిగతా సేవలకు మాత్రమే 108కు కాల్‌ చేస్తే వస్తాయి. త్వరలోనే మరో 100 పాత 104 వాహనాలను కోవిడ్‌ కోసం అందుబాటులోకి తేనున్నారు. కోవిడ్‌తో మృతిచెందిన వారి కోసం మహాప్రస్థానం వాహనాలను వినియోగిస్తున్నారు.

Also Read: ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..