AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..

క‌రోనా వ‌చ్చింది. క‌ష్టాలు తెచ్చింది. అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌పోయారు. ఎన్ని క‌ష్టాలు ఉన్నా బ్ర‌తికి ఉండాలంటే రోజూ ఐదేవేళ్లు నోట్లోకి వెళ్లాల్సిందే.

కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2020 | 4:39 PM

Share

Sonu Sood : క‌రోనా వ‌చ్చింది. క‌ష్టాలు తెచ్చింది. అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌పోయారు. ఎన్ని క‌ష్టాలు ఉన్నా బ్ర‌తికి ఉండాలంటే రోజూ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాల్సిందే. అలా కావాలంటే రైతు స్వేదం చిందించాల్సిందే. కానీ ఇంత చేసినా రైతుకు గుర్తింపు ద‌క్క‌డం లేదు. అత‌డు చేసిన శ్ర‌మ‌కు గిట్టుబాటు ద‌క్క‌డం లేదు. ఎన్నో క‌ష్టాలు, అంత‌కుమించిన క‌న్నీళ్లు. తాజాగా ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో మ‌న‌సును మెలిపెట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. పొలం దున్నడానికి ఎద్దులను అద్దెకు తీసుకునేందుకు డ‌బ్బులు లేక.. తన కూతుర్ల‌తో కాడి మోయించిన ఓ రైతు వీడియో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ విషయాన్ని ఓ వ్య‌క్తి​ ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. కరోనాతో గ‌త సీజ‌న్ లో భారీ న‌ష్టాలు రావ‌డంతో.. చేతిలో చిల్లిగవ్వ అయినా లేకపోవడం వల్ల ఇలా చేయ‌క తప్ప‌ద‌ని ఆ రైతు గోడు విన్నవించుకున్నాడు. ఈ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అది న‌టుడు సోనూసూద్ కంట‌ప‌డింది.

తీవ్రంగా చ‌లించిపోయిన నటుడు​ సోనూసూద్.. ఆ​ రైతు కుటుంబానికి అండగా ఉంటానని భ‌రోసా ఇచ్చారు. సోమవారం(జులై 27) ఉదయం అయ్యేసరికి వారి ఇంటి ముందు ఒక జ‌త ఎడ్లు ఉంటాయ‌ని ట్వీట్ చేశారు. బాలికలను చదువుపై ఫోకస్ పెట్టనివ్వాలని సూచించారు.

మ‌ళ్లీ కాసేటికే స్పందించిన సోనూ..వారికి కావాల్సింది ఎడ్లు కావు..ట్రాక్ట‌ర్ అని..సాయంత్రం వ‌ర‌కు అది వారి పొలంలో ఉంటుంద‌ని ట్వీట్ చేశాడు.

కాగా క‌రోనా లాక్​డౌన్​ నేప‌థ్యంలో పలు ప్రాంతాల‌లో చిక్కుకున్న వేలాది మంది వలస కూలీలు సొంత ఊర్ల‌కు వెళ్లేందుకు సాయం చేశారు సోనూసూద్. దీంతో సోష‌ల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు వర్షం కురుస్తుంది.

Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..