మానససరోవరంలో చిక్కుకున్నాం.. కాపాడాలంటూ వేడుకోలు
ఈ నెల 13న మానససరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది తెలుగువాళ్లు అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ముద్దాపురం మదన్ గౌడ్‌తో పాటు 31 మంది గత ఐదురోజులుగా చైనా- నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. సదరన్ ట్రావెల్ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. యాత్రలో చిక్కుకున్న వారిలో మదన్ గౌడ్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం నేతగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం తీరును […]
ఈ నెల 13న మానససరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది తెలుగువాళ్లు అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ముద్దాపురం మదన్ గౌడ్‌తో పాటు 31 మంది గత ఐదురోజులుగా చైనా- నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. సదరన్ ట్రావెల్ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. యాత్రలో చిక్కుకున్న వారిలో మదన్ గౌడ్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం నేతగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం తీరును ఆయన తీవ్రంగా తప్పుపడుతూ.. తమను కాపాడాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఎట్టకేలకు స్పందించిన సదరన్ ట్రావెల్స్.. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో.. వారు అక్కడ చిక్కుకున్నారని అన్నారు. వీరిని రేపు సాయంత్రం వరకు తీసుకొస్తామని స్పష్టం చేశారు.