ఇద్దరు ఆర్మీ సైనికులు హతం.. కారణమిదే!

జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు ఆర్మీ సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఖారీ త్రయత్ వద్ద అటవీ ప్రాంతం వెంబడి పాకిస్తాన్ నుండి చొరబడటానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ఉగ్రవాదులను సైనికులు గుర్తించారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే, చొరబాటుదారులు సైనిక దళాలపై కాల్పులు జరిపారు. అక్కడ భారీ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. “నౌషెరా సెక్టార్లో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇద్దరు ఆర్మీ సైనికులు […]

ఇద్దరు ఆర్మీ సైనికులు హతం.. కారణమిదే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 01, 2020 | 11:58 AM

జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు ఆర్మీ సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఖారీ త్రయత్ వద్ద అటవీ ప్రాంతం వెంబడి పాకిస్తాన్ నుండి చొరబడటానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ఉగ్రవాదులను సైనికులు గుర్తించారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే, చొరబాటుదారులు సైనిక దళాలపై కాల్పులు జరిపారు. అక్కడ భారీ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

“నౌషెరా సెక్టార్లో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇద్దరు ఆర్మీ సైనికులు అమరవీరులయ్యారు. ఆపరేషన్ ఇంకా పురోగతిలో ఉంది. మేము మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నాము” అని జమ్మూకు చెందిన భారత ఆర్మీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు.

[svt-event date=”01/01/2020,11:37AM” class=”svt-cd-green” ]

[/svt-event]