AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనీ తర్వాత ధోనీ అంతటివాడు సంజు శాంసన్‌ : శశి థరూర్‌ కితాబు

మహేంద్రసింగ్‌ ధోనీకి ప్రత్యామ్నాయం దొరికాడా? మహీ స్థానాన్ని సంజు శాంసన్‌ భర్తీ చేస్తాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్‌ పండితులు.. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడిన సంజూ శాంసన్‌ ఆట తీరే ఇందుకు నిదర్శనమంటున్నారు..

ధోనీ తర్వాత ధోనీ అంతటివాడు సంజు శాంసన్‌ : శశి థరూర్‌ కితాబు
Balu
|

Updated on: Sep 28, 2020 | 10:45 AM

Share

మహేంద్రసింగ్‌ ధోనీకి ప్రత్యామ్నాయం దొరికాడా? మహీ స్థానాన్ని సంజు శాంసన్‌ భర్తీ చేస్తాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్‌ పండితులు.. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడిన సంజూ శాంసన్‌ ఆట తీరే ఇందుకు నిదర్శనమంటున్నారు.. కళ్లు చెదిరే సిక్సర్లతో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించిన సంజుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. కింగ్స్‌ ఎలవెన్‌ పంజాబ్‌ విసిరిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమంటే మాటలు కాదుగా..! ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో సంజు శాంసన్‌దే కీలక భూమిక! రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అయితే శాంసన్‌ను తెగ మెచ్చుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 159 పరుగులను సాధించాడు సంజు.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన వారి చిట్టాలో సంజుది నాలుగో ప్లేస్‌.. తను చేసిన రన్స్‌లో ఏకంగా 16సిక్సర్లు, అయిదు బౌండరీలు ఉన్నాయి.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇన్నేసి సిక్సర్లు ఎవరూ బాదలేదు.. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సంజు శాంసన్‌ బ్యాటింగ్‌ను కొనియాడాడు. భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ ప్లేస్‌ను భర్తీ చేయగల సమర్థుడు సంజు శాంసనేనని తాను ఎప్పుడో చెప్పానని శశిథరూర్‌ ట్వీట్ చేశారు. రాజస్తాన్‌కు ఇది తిరుగులేని విజయమని, పదేళ్లుగా సంజుశాంసన్‌ను తాను ఎరుగుదునని , ఏదో ఒక రోజున ధోనీ తర్వాత ధోనీ అంతటి వాడవి అవుతావని అతడికి 14 ఏళ్లప్పుడే చెప్పానని ట్వీట్‌ చేశారు థరూర్‌..అయితే మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌కు శశిథరూర్‌ వ్యాఖ్యలు ఎందుకో రుచించలేదు.. మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజు శాంసన్‌కు ఏముంది? అతడు అతడిలా ఆడితే చాలు అని ట్వీట్‌ చేశాడు గౌతం గంభీర్‌.. వీరి ట్వీట్లు ఎలా ఉన్నా .. సంజు శాంసన్‌ మాత్రం అద్భుతమైన ఆటగాడనడటంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు..